Bhumi Pednekar భూమి పెడ్నేకర్. ఈ పేరు గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోయినప్పటికీ బాలీవుడ్ సినీ అప్డేట్స్ ఫాలో అయ్యేవాళ్లకు మాత్రం కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఈ అమ్మడికి నటనపై ఉన్నటువంటి డెడికేషన్ మరియు ప్యాషన్ గురించి ముందుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నటి భూమి పెడ్నేకర్ ఏదైనా సినిమాకి సంతకం చేస్తే ఆ పాత్రకి అనుగుణంగా తన యాక్టింగ్ స్టైల్ ని అలాగే శరీరాకృతిని కూడా సిద్ధం చేసుకుంటుంది.
అందుకే ఈ అమ్మడు ఒక్కో సినిమాలో ఒక్కో స్టైల్ లో కనిపిస్తుంటుంది. అయితే ఈ మధ్య నటి భూమి పెడ్నేకర్ కూడా రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్లామర్ కి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలను ఎంచుకుంటోంది. దీంతో బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఏకంగా జీరో సైజ్ నడుములోకి వచ్చేసినట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు కారణంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా నటి భూమి పెడ్నేకర్ క్లీవేజ్ షో చేస్తూ ఘాటుగా అందాల ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఎరుపు రంగు దుస్తుల్లో నటి భూమి పెడ్నేకర్ మతి పోగుడుతోందంటూ నెటిజన్లు తెలుగు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ బ్యూటీ తన పాత్రకి తగ్గట్లుగా శరీరాకృతిని మార్చుకునేందుకు తెగ కష్టపడుతుందని అలాగే నటనపై ఉన్నటువంటి డెడికేషన్ కి టేక్ ఏ బౌ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్ముడు బాలీవుడ్లో దాదాపుగా ఐదు కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఇప్పటికే మూడు చిత్రాలు షూటింగ్ పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ అమ్మడు మరో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.