Bhumika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న భూమిక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా బాయ్.. కిసీ కీ జాన్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి భూమిక పలు విషయాలను వెల్లడించారు.
ఈమె హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి మంచి విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి భూమిక బాలీవుడ్ హీరో మరణం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని ఒక్కసారిగా కలిచి వేసింది.
Bhumika: సుశాంత్ మరణం షాక్ కి గురిచేసింది…
ఇక సుశాంత్ మరణం భూమికను ఎంతగానో కృంగదీసిందని, ఆయన మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలియజేశారు. సుశాంత్ మరణ వార్త నుంచి తాను కోలుకోవడానికి చాలా సమయం పట్టిందంటూ ఈ సందర్భంగా భూమిక వెల్లడించారు. సుశాంత్ మరణించిన సమయంలో కోవిడ్ కారణంగా తాను ముంబైకి దూరంగా ఉన్నానని అందుకే తనని చివరి చూపు కూడా చూసుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సుశాంత్ నటించిన ఎంఎస్ ధోని సినిమాలో తనకు అక్క పాత్రలో భూమిక నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఎంతో మంచి పరిచయం ఏర్పడింది. అయితే సుశాంత్ మరణం మాత్రం తనని ఎంతగానో బాధ పెట్టిందని భూమిక చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.