Bhumika: ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి నటి భూమిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి గుర్తింపు పొందారు.. ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా బాయ్… కిసీ కీ జాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈమె వెంకటేష్ భార్య పాత్రలో నటించారు. ఇకపోతే ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి భూమిక పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తమకన్నా వయసు తక్కువగా ఉండే హీరోలతో రొమాన్స్ చేస్తే తప్పుగా భావిస్తుంటారు ఇలా తక్కువ వయసు ఉన్న హీరోలతో రొమాన్స్ చేస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు.ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నటువంటి భూమిక యువ హీరోలతో రొమాన్స్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో హీరోలు తమ వయసులో సగం కన్నా తక్కువగా ఉండే హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు.
Bhumika: హీరోలు చేస్తే తప్పులేదు కానీ…
ఈ విధంగా చిన్న వయసు హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేస్తే తప్పులేదు కానీ హీరోయిన్లు మాత్రం తక్కువ వయసు ఉన్నటువంటి హీరోలతో రొమాన్స్ చేస్తే తప్పుగా భావిస్తారు. ఇదే న్యాయం అంటూ భూమిక ఈ విషయాలపై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.భూమిక చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే ఈమె యువ హీరోలతో రొమాంటిక్ సన్నివేశాలలో నటించే అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోరని వాటిలో నటించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. భూమిక చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.