Bigg Boss 7: దేశవ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరన పొందిన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో కూడా ఈ రియాలిటీ షో ప్రారంభమై ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది. ఇక తొందరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు ఇటీవల ప్రోమో కూడా విడుదల చేశారు. దీంతో బిగ్ బాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 లో ఉండే కండిషన్లకి కంటెస్టెంట్లు మాత్రం ఇబ్బంది పడక తప్పదు అంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకాలం బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లే ముందు ఒకలా హౌస్ నుండి బయటికి వచ్చిన మరొకలా మాట్లాడటం చూస్తూనే ఉన్నాము.
అయితే కంటెస్టెంట్లు ఇలా ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ గురించి నెగటివ్ కామెంట్స్ చేయటంతో ఆ షో రేటింగ్స్ పడిపోతున్నాయి. అందువల్ల బిగ్ బాస్ సీజన్ 7 గురించి నెగెటివిటీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి బిగ్ బాస్ టీం ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కోసం ఎంపికైన కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ షో గురించి కానీ.. హౌస్ లో జరుగుతున్న సంఘటనల గురించి ఎక్కడా కూడా నెగిటివ్ కామెంట్స్ చేయకూడదని బిగ్ బాస్ టీం కొత్త కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
Bigg Boss 7: సగం రెమ్యూనరేషన్ కట్…
ఈ కండిషన్ అతిక్రమించి ఎవరైనా ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ షో గురించి నెగటివ్ కామెంట్స్ చేస్తే వారి రెమ్యూనరేషన్ లో సగం కట్ చేయబోతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. అంతే కాకుండా కంటెస్టెంట్లు ఈ కండిషన్ కి ఒప్పుకుంటున్నట్టు అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసిన తర్వాతే కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకున్నట్లు కూడా ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ టీం పెట్టిన ఈ కండిషన్స్ వల్ల సీజన్ సెవెన్ గురించి నెగెటివిటీ స్ప్రెడ్ అవ్వకుండా కట్టడి చేయవచ్చు. అయితే కంటెస్టెంట్లు మాత్రం పొరపాటున షో గురించి తప్పుగా మాట్లాడితే నష్టపోవాల్సిందే.