Bigg Boss 7: దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో మరొక సీజన్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటివరకు ఆరు సీజన్లో పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో త్వరలోనే ఏడవ సీజర్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు సీజన్ 7 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ప్రేక్షకులు ఈ వార్త తెలియగానే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇంతకాలం బిగ్ బాస్ సీజన్ 7 గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో సీజన్ సెవెన్ ఉంటుందా లేదా అని బిగ్ బాస్ అభిమానులు అయోమయంలో ఉన్నారు.
అయితే తాజాగా బిగ్ బాస్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రోమో విడుదల చేసి మేకర్స్ అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. BB7 తెలుగు మిమ్మల్ని ఎమోషన్స్, సర్ప్రైజ్‌లు మరియు థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో కూడిన రోలర్‌కోస్టర్ రైడ్‌లో తీసుకెళ్తుంది. కాబట్టి మీరు మరింతగా విండోమ్ ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. సరద గొడవల నుండి హృదయాన్ని కదిలించే కథల వరకు, మిమ్మల్ని అడుగడుగునా అలరిస్తామని మేము హామీ ఇస్తున్నాము” అంటూ బిగ్ బాస్ సీజన్ 7 నుండి ఒక చిన్న గ్లింప్స్ ను స్టార్ మా రిలీజ్ చేసింది.
Bigg Boss 7: హోస్ట్ గా నాగార్జునేనా…
అయితే ఈ సీజన్ సెవెన్ లో హోస్ట్ ఎవరు ? అన్న విషయం గురించి ఇప్పటివరకు సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారు. ఇంతకాలం బిగ్ బాస్ సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున సీజన్ 7 నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున స్థానంలో హోస్ట్ గా మరో స్టార్ హీరో సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్టార్ హీరో ఎవరో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే. ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే ఈ సీజన్ సెవెన్ లో అందరూ స్టార్ సెలబ్రిటీలు సందడి చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రోమో రిలీజ్ చేసి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.