Bigg Boss: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లో కొనసాగుతున్నటువంటి అమర్ దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన బుల్లితెర ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అమర్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడంతో ఈయనకు బిగ్ బాస్ అవకాశమిచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి అమర్ కు చాలా అన్యాయం జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ బిగ్ బాస్ కూడా చాలా లైట్ గా తీసుకుంటున్నారు.

ముఖ్యంగా శివాజీ తనని హేళన చేస్తూ మాట్లాడటమే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. దాంతో అమర్ చాలా ఇబ్బంది పడుతున్నారని బయటకి నవ్వుతూ ఉన్న లోపల ఆయన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. పలు టాస్కూలలో కూడా తన బాధని మొత్తం బయటపెట్టారు. గత కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఫలంగా పడిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయనకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా అందించారు. ఇక తనకు ఫిట్స్ రావడం వల్లే పడిపోయారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

కండరాల పెరుగుదల లేదు..

తాజాగా అమర్ హెల్త్ గురించి తన ఫ్రెండ్ నరేష్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమర్ నిజంగానే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలియజేశారు. నీతోనే డాన్స్ సమయంలో అమర్ చాలా మానసికంగా ఇబ్బందులకు గురయ్యారు ఆయన శరీరంలో కండరాల పెరుగుదల లేదని డాక్టర్లు చెప్పారని అందుకు తగ్గ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారని అమర్ స్నేహితుడు తెలిపారు. కొద్దిరోజులుగా తనకు సరైన నిద్ర కూడా లేదని బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చే రెండు రోజుల ముందే కంటి నిండా నిద్రపోయారని తెలిపారు. కానీ తనకి ఇలాంటి సమస్య ఉందని అమర్ ఎక్కడ కూడా హౌస్ లో చెప్పలేదు. ఎంతో అద్భుతంగా టాస్కులలో కూడా ఆడుతున్నారని కానీ కొందరు తనని ఫిజికల్ గాను మెంటల్ గాను ఇబ్బందులు పెడుతున్నారు అంటూ నరేష్ వెల్లడించారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 25, 2023 at 11:30 ఉద.