Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం 9వ వారంలోకి అడుగు పెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా నామినేషన్స్ ప్రక్రియ కూడా కాస్త ఆసక్తికరంగానే మారింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా హీరో శివాజీ పై అమర్ పై చేయి సాధించారు. అమర్ అడిగే ప్రశ్నలకు శివాజీ సమాధానం చెప్పలేకపోవడంతో నామినేషన్స్ ప్రక్రియ కూడా ఆసక్తికరంగా మారింది. మరి శివాజీ అమర్ మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది అనే విషయానికి వస్తే.. అమర్ శివాజీని ఉద్దేశిస్తూ అన్న నేను మీకెందుకు నచ్చడం లేదు నాకు తెలియదు కానీ మీకు నేను నచ్చని విధంగానే మీరు కూడా నాకు నచ్చడం లేదని ఓపెన్ గా చెప్పేశారు.
అమర్ ఆటలో నేను మాత్రమే అరుస్తున్నాని, కేకలు వేస్తున్నానని ప్రతిసారి నన్ను నామినేషన్ చేస్తున్నావ్. నాలాగే నీ పక్కన ఉన్నవారు కూడా నామినేషన్స్ లో గట్టిగా కేకలు వేస్తున్నారు కానీ మీరు వారిని ఎందుకు నామినేట్ చేయడం లేదు వారికి ఎందుకు చెప్పడం లేదు అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు శివాజీ సమాధానం చెబుతూ వారికి కూడా నేను చెబుతున్నాను అంటూ సమాధానం చెప్పారు. అలా చెప్పడం కాదన్నా మీరు నాకు ఎలా చెప్పారో వారిని కూడా నామినేషన్స్ లో నిలబెట్టి చెప్పండి అంటూ గట్టిగా అడగడంతో శివాజీ సమాధానం లేక పక్కకు తప్పుకున్నారు.
నామినేషన్ లో 8మంది కంటెస్టెంట్లు…
ఇలా అమర్ కరెక్ట్ పాయింట్ పైన శివాజీని నామినేట్ చేస్తూ ఆయనని అడగడంతో శివాజీ సమాధానం చెప్పలేకపోవడం వల్ల అమర్ పై చేయి సాధించారు. అలాగే సందీప్ మాస్టర్‌ను ఇంటి నుంచి పంపించావ్ అని తేజను నామినేట్ చేస్తాడు శివాజీ.. మరి సందీప్ మాస్టర్‌ను ఎలిమినేషన్ లిస్ట్‌లో పెట్టిన యావర్‌ను మాత్రం ఒక మాట కూడా అనలేకపోయాడు శివాజీ. ఇలా ఈ వారంలో శివాజీ దొరికిపోయాడు. ఇక ఈవారం నామినేషన్ లో ఎవరెవరు ఉన్నారు అనే విషయానికి వస్తే.. అమర్, రతిక, శోభ, ప్రియాంక, అర్జున్, తేజ, శవాలి, యావర్ ఈ 8 మంది ఈ వారం నామినేషన్ లో ఉన్నారు.