Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం మరొక రెండు వారాలలో పూర్తీ కాబోతోంది. ప్రస్తుతం 13 వ వారం కొనసాగుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే షేర్ చేశారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు పలు టాస్కులు ఇస్తూ ఇందులో ఎవరు ఎక్కువ పాయింట్స్ సాధిస్తే వాళ్ళు నేరుగా ఫినాలేకి వెళ్తారని చెప్పారు. ఈ క్రమంలోనే పలు టాస్కులను నిర్వహించగా కంటెస్టెంట్లు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఈ టాస్కులలో పాల్గొన్నారు.

ఇలా మొదటి టాస్క్ లో అర్జున్ ఎక్కువ పాయింట్స్ సంపాదించగా రెండో టాస్కులు అమర్ ఎక్కువ పాయింట్స్ సాధించారు. ఇలా ఈ వారం మొత్తం టికెట్ టూ ఫినాలే టాస్కులు జరగబోతున్నాయని తెలుస్తుంది. మరి ఇందులో ఎవరు మొదటగా టికెట్ టూ ఫినాలే కైవసం చేసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ టాస్కులలో కూడా శివాజీ తన తీరు ఏమాత్రం మార్చుకోలేకపోయారు. బిగ్ బాస్ నిర్వహిస్తున్నటువంటి టికెట్ టు ఫినాలే టాస్కులలో కూడా శివాజీ తన ఆట తీరును కనబరిచలేకపోయారు.

గేమ్ ఆడలేక పోతున్న శివాజీ…

ఇలా రెండు టాస్క్లలోనూ పెద్దగా ఆట తీరును శివాజీ కనపర్చకపోయిన ఆయనకు సంచాలకగా మరో టాస్క్ కి నియమించారు అయితే సంచాలక్ గా బాధ్యతలు ఇస్తే అక్కడ కూడా పిచ్చిపిచ్చి రూల్స్ పెట్టి ప్రియాంక గెలవకుండా అడ్డుకున్నారు. ఇలా శివాజీ కారణంగా ఆయన ఆట తీరు మాత్రమే కాకుండా మొత్తం గేమ్ తీరే మారిపోయేలాగా ఉందని తెలుస్తుంది. మరి ఇలాగే కొనసాగితే కష్టమేనని చెప్పాలి అయితే ఈ టికెట్టు టూ ఫినాలే టాస్కులలో భాగంగా ఈయన వ్యవహరించినటువంటి తీరు నెటిజెన్లకి కూడా విసుగు తెప్పిస్తుంది ఈయన అసలు మారారని గేమ్ ఆడటం చేతకాదు కానీ రూల్స్ పెడుతూ అందరినీ ఇబ్బంది పెడుతుంటారంటూ ఈయన వ్యవహార శైలి పై కామెంట్స్ చేస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 29, 2023 at 11:32 ఉద.