Bigg Boss7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రస్తుతం 11 వ వారం కొనసాగుతూ వచ్చింది. నామినేషన్స్ అంటే పెద్ద ఎత్తున కంటెస్టెంట్ల మధ్య గొడవలు ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఈసారి మాత్రం రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అంబటి అర్జున్ మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుందని చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్ లో ప్రశాంత్ అర్జున్ కి కౌంటర్ ఇవ్వగా తాజా ఎపిసోడ్ లో మాత్రం కౌంటర్ ఎలిమినేషన్ చేస్తున్నారు. అర్జున్ ప్రశాంత్ తో మాట్లాడుతూ నన్ను ఎవరు ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారని మాట్లాడవు అంటూ ప్రశాంత్ అనడంతో అర్జున్ కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
ప్రశాంత్ మాట్లాడిన మాటలకు అర్జున్ రియాక్ట్ అవుతూ నేను చెప్పేది తప్పని చెప్పడానికి నువ్వే ఎవడ్రా అంటూ కౌంటర్ ఇవ్వగా వెంటనే పల్లవి ప్రశాంత్ నేను ఎవరో గూగుల్ ను చెబుతుంది అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్ చూపించడంతో సహనం కోల్పోయినటువంటి అర్జున్ నేను పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశాను. నేను నిన్నే అడుగుతా వేరెవరినో నేనెందుకు అడుగుతాను అంటూ ప్రశాంత్ పై కౌంటర్ ఇచ్చారు.
యాటిట్యూడ్ చూపిస్తున్న రైతుబిడ్డ…
బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చేవరకు పల్లవి ప్రశాంత్ ఎవరో కూడా చాలామందికి తెలియదు ఈయన రైతుబిడ్డ అంటూ వీడియోలు చేయడం తప్ప పెద్దగా ఎవరికి పరిచయం లేదు అయితే ఈ కార్యక్రమానికి వచ్చి నేనెవరో తెలుసుకోవాలంటే గూగుల్ ని అడుగు అని మాట్లాడటంతో కొంతవరకు ఈయనపై నెటిజెన్స్ కాస్త నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నారు. ఇలాగే కొనసాగితే రైతుబిడ్డ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని, కాస్త ఆటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ కూడా సలహాలు ఇస్తున్నారు.