Bigg Boss 7: బిగ్ బాస్ కార్యక్రమం ఏడువారాలను పూర్తిచేసుకుని ఎనిమిదవ వారంలో ప్రసారమవుతుంది ఎనిమిదవ వారంలో భాగంగా ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇన్ని రోజుల పాటు చేయి నొప్పితో టాస్క్ లకు దూరంగా ఉన్నటువంటి శివాజీ తన స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఇక సీరియల్ బ్యాచ్ అంతా ఒకవైపు ఉండగా మిగిలిన వారందరూ కూడా శివాజీ బ్యాచ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.
అయితే తాజాగా శివాజీ వ్యవహారం చూస్తుంటే ఈయన సీరియల్ బ్యాచ్ కి గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. కొత్తగా వచ్చిన షావలి, అశ్వినీ కూడా శివాజీ టీమ్‍లో చేరినట్టుగా అర్థమవుతుంది. నామినేషన్స్ గురించి శివాజీ మాట్లాడాడు. నామినేషన్స్ అనేసరికి ఎవరినైనా తిడితే హీరో అవుతామనే ఫీలింగ్స్ తో రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చాడు శివాజీ. ఏమీ లేకపోయినా ఎగిరి ఎగిరి పడుతున్నాయి కొన్ని విస్తరాకులు అని సామెత చెప్పాడు. శివాజీ ఈ వ్యాఖ్యలు కచ్చితంగా అమర్ ని ఉద్దేశించే మాట్లాడారని స్పష్టంగా అర్థం అవుతుంది.
రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు…
ఇది గొప్ప హౌస్ అని, నామినేషన్స్ అనేది తెలివైన ప్రక్రియ అని, అపహాస్యం చేస్తున్నట్టుగా పేర్కొన్నాడు. స్ట్రాటజీతో వచ్చారని మెుదటివారమే గమనించినట్టుగా తెలిపారు. ప్రియాంక, శోభా శెట్టి, సందీప్, అమర్‍దీప్ కూడా కాసేపు మాట్లాడుకున్నారు. ఎదుటివారిని మాట్లాడనివ్వకుండా ఓవర్ ల్యాప్ చేయడం వారి ప్లాన్ అని సందీప్ చెప్పుకొచ్చాడు. భోలే శోభా శెట్టి మాట్లాడటంతో అయినా అమర్ మొదటి వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది అని ఎలా మాట్లాడుతారు అంటూ ప్రియాంక కూడా మాట్లాడారు. మొత్తానికి హౌస్ లో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయని సీరియల్ బ్యాచ్ కి శివాజీ బ్యాచ్ గట్టి షాక్ ఇవ్వబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.