Bigg boss: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం నేటితో 11 వారాలను పూర్తి చేసుకోబోతుంది. ఇలా ఈ కార్యక్రమం 11 వారాలు పూర్తి కావడంతో ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఈ వారం నామినేషన్స్ లో భాగంగా పల్లవి ప్రశాంత్ శివాజీ మినహా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఉన్నారు. నామినేషన్ లో భాగంగా ఉన్నటువంటి కంటెస్టెంట్లలో చివరి స్థానంలో ముగ్గురు అమ్మాయిలు ఉండటం గమనార్హం.

ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత చివరిలో శోభా శెట్టి, అశ్విని రతిక వంటి వారు ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ వారం ఎలిమినేషన్ కనుక ఉంటే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే బిగ్ బాస్ ముందు నుంచి కూడా శోభా శెట్టి రతిక వంటి వారిని బయటకు పంపించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. బయటకు వెళ్లిన రతికను తిరిగి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకువచ్చారు. ఇక ఈవారం డేంజర్ పొజిషన్లో వీళ్లే ఉండటంతో వీరిని సేవ్ చేయడానికి బిగ్ బాస్ ఊహించని నిర్ణయం తీసుకుంది.

వారి కోసమే ఎలిమినేషన్ క్యాన్సిలా…

ఇలా ఈవారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లలో అమ్మాయిలు బయటకు వెళ్లాల్సి రావడంతో ఏకంగా ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ వారం ఎలిమినేషన్ ఉండబోదని స్పష్టంగా తెలుస్తోంది. ఇలా ఈవారం ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసినటువంటి బిగ్ బాస్ బహుశా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నారట్టు వార్తలు వస్తున్నాయి. ఇక 12 వ వారంలో జరిగే నామినేషన్స్ లో భాగంగా ఎవరైతే తక్కువ ఓట్లు కలిగి ఉంటారో వారిని బయటికి పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అయితే అమ్మాయిలను సేవ్ చేయడం కోసమే బిగ్ బాస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 19, 2023 at 1:03 సా.