Bigg Boss: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం 11 వారాలను పూర్తి చేసుకుంది 11 వ వారంలో భాగంగా ఎవరు ఎలిమినేట్ కానున్నారనే విషయంపై చివరి వరకు ఉత్కంఠత కొనసాగింది. అయితే ఈ వారం ఎలిమినేషన్ లేదంటూ వార్తలు వచ్చినప్పటికీ నాగార్జున మాత్రం ఆదివారం ఎపిసోడ్లో భాగంగా ఎలిమినేషన్ ఉన్నట్లే మొదటి నుంచి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఇలా నామినేషన్స్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా కొన్ని టాస్కులు ఇస్తూ సేవ్ చేస్తూ వచ్చారు. చివరికి అశ్విని గౌతమ్ మాత్రమే మిగిలారు..
ఇక వీరిద్దరిలో ఎవరో ఒకరు బయటకు వస్తారని అందరూ భావించారు. చివరిగా నాగార్జున వీరిద్దరి ముందు ఒక బాక్స్ పెట్టి అందులోకి చెయ్యి పెట్టి పైకి తీయాలని ఎవరు చేయి గ్రీన్ కలర్ లో ఉంటుందో వారు సేఫ్ రెడ్ కలర్ లో ఉన్న వాళ్ళు ఎలిమినేషన్ అంటూ చెప్పారు. ఇక గౌతమ్ అశ్విని ఇద్దరు కూడా ఆ బాక్స్ లోకి చేయి పెట్టి పైకి తీయగా ఇద్దరు చేతులు కూడా గ్రీన్ కలర్ లో ఉండడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక ఈ వారం నో ఎలిమినేషన్ అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్ మేట్స్ సంతోషం వ్యక్తం చేశారు.
ఎవిక్షన్ పాస్ ఇవ్వడమే కారణమా…
ఇక ఈవారం ఎలిమినేషన్ లేకపోవడానికి కారణం ఉందని యావర్ తన ఎవిక్షన్ పాస్ తిరిగి బిగ్ బాస్ కు ఇవ్వటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ నాగార్జున చెప్పుకు వచ్చారు. అయితే శోభ శేట్టిని సేవ్ చేయడం కోసమే ఇలా చేశారు అంటూ మరికొందరు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈవారం ఎలిమినేషన్ లేకపోవడంతో వచ్చేవారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం నామినేషన్స్ లో ఈ వారం శోభాశెట్టి ప్రియాంక తప్ప మిగిలిన ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.