Bigg Boss 7: బుల్లితెర మీద ప్రసారమైన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమయ్యే ఇప్పటికే ఆరు సీజన్ లో పూర్తి చేసుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయింది. దీంతో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్న పోయే కంటెస్టెంట్ లో అంటూ కొందరు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ 7 లో బుల్లితెర నటుడైన ప్రభాకర్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సింగర్ మోహన భోగరాజు, బుల్లితెర నటులు అమర్ దీప్, తేజస్విని కూడా బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సీజన్ సెవెన్ లో యాంకర్ ఉదయభాను కూడా సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే బిగ్ సీజన్ 7 లోకి ఇద్దరు సింగర్లు కంటెస్టెంట్లుగా వెళుతున్నట్లు సమాచారం.
Bigg Boss 7:
ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మరొక జోడి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ జోడి మరెవరో కాదు ఆట డాన్స్ షో ద్వారా కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన ఆట సందీప్. సందీప్ తన భార్య జ్యోతితో కలిసి జంటగా బిగ్ బాస్ సీజన్ 7 లో అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ , జ్యోతి జంటకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సందీప్ తన భార్య జ్యోతితో కలిసి డాన్స్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ బాగా పాపులర్ అయ్యాడు. అంతే కాకుండా సినిమా ఈవెంట్లు, కవర్ సాంగ్స్ చేస్తూ తనదైన మార్క్ డాన్స్‌లతో జనాలను అలరిస్తుంటాడు.