Bigg Boss: త్వరలో బిగ్ బాస్ సీజన్ 6.. ఈసారి ఎవరంటే?

Akashavani

Bigg Boss : తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ఏ స్థాయిలో ఆదరణ పొందిందో మనందరికీ తెలుసు. ఈ షో కోసం ఎదురు చూసేవారు కోట్లల్లో ఉన్నారని చెప్పొచ్చు. మొదట్లో బిగ్ బాస్ ఆదరణ తగ్గుముఖం పట్టినప్పటికీ.. క్రమంగా హోస్ట్ నాగార్జున రాకతో ఆ షో ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది.

మొత్తానికి తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో మరో స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది. గతంలో బిగ్ సీజన్ ముగిసిన వెంటనే చాలామంది మళ్లీ బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందా.. అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఆ క్రమంలోనే బిగ్ బాస్ ప్రేక్షకులకు ఒక మంచి గుడ్ న్యూస్ తెలిపాడు. బిగ్ బాస్ రియాలిటీ షోను ఓటీటీ వెర్షన్ లో స్ట్రీమ్ చేసారు.

ఈ షో ఓటీటీ లో మరింత ఆదరణ పొందింది. ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు కూడా మరో లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హౌస్ లో మొత్తం బోల్డ్ వ్యవహారం నడిపారు. కాగా విజయవంతంగా ఓటీటీ నాన్ స్టాప్ షో ముగియడానికి వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త బయట పడింది.

బిగ్ బాస్ సీజన్ ఆరు ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతుంది అని తెలుస్తుంది. ఇక రాబోతున్న ఆ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు అని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ తో సంబంధం లేకుండా టెలివిజన్ సీజన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఆరవ సీసన్ గత ఏడాది కంటే కొంచెం ముందుగా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

Bigg Boss: త్వరలో బిగ్ బాస్ సీజన్ 6.. ఈసారి ఎవరంటే?
Bigg Boss: త్వరలో బిగ్ బాస్ సీజన్ 6.. ఈసారి ఎవరంటే?

Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 6 లో వీళ్లు కూడా ఉంటారట!

ఈ సీజన్ సిక్స్ లో బడా సెలబ్రేటీలతో పాటు కామన్ మ్యాన్స్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు తెలుస్తున్నాయి. వీటి వెనుక నిజమెంతో అబద్ధమెంతో.. బిగ్ బాస్ అధికార ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -