యూట్యూబ్లో పలు షార్ట్ ఫిలిమ్స్, అలాగే వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించినటువంటి తెలుగమ్మాయి దేత్తడి హారిక గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కించుకొని అడపాదడపా చిత్రాల్లో నటించింది. కానీ ఈ చిత్రాల్లోని పాత్రలు పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే సిల్వర్ స్క్రీన్ పై రాణించ లేకపోయింది. కానీ ప్రముఖ రియాల్టీ గేమ్ షో అయిన బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలు కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత ఈ అమ్మడి కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రస్తుతం పలు రకాల షోలు, ఈవెంట్లు, ఫోటోషూట్లు అంటూ బిజీ బిజీగా గడుపుతూ రెండు చేతులా సంపాదిస్తుంది.
అయితే తాజాగా దేత్తడి హారిక తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసినటువంటి వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ట్రాన్స్పరెంట్ ధరించి కొంతమేర స్కిన్ షో మరియు నాభి అందాలు ఆరబోతతో ఈ వీడియోలో కనిపించింది. అంతేకాకుండా ఈ వీడియోకి ఏకంగా “వెల్కమ్ టు మై డార్క్ సైడ్” అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో నెటిజన్లు హారిక అందాల ఆరబోతకి ఫిదా అయ్యారు. మరికొందరైతే ఏకంగా ఈమధ్య దేత్తడి హారిక సినిమా ఆఫర్ల కోసం అందాల ఆరబోత షురూ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఏకంగా మీరు బిగ్ బాస్ గేమ్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనకముందు ఒకలా మరియు ఇప్పుడు ఒకలా ఉన్నారంటూ కామెంట్ చేశాడు దీంతో దేత్తడి హారిక ఏకంగా ఎప్పుడూ ఒకేలా ఎలా ఉంటాం బాస్ అంటూ రిప్లై ఇచ్చింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య దేత్తడి హారిక సినిమాల్లో హీరోయిన్గా ఆఫర్ల కోసం ట్రై చేస్తున్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో గోల్డ్ గా ఫోటోషూట్ లో రిల్స్ వంటివి షేర్ చేస్తూ రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ఏదేమైనప్పటికీ ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు లేకపోయినప్పటికీ ఫైనాన్షియల్ గా మాత్రం బాగానే సెటిల్ అయినట్లు తెలుస్తోంది.