Bigg Boss Himaja: బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో నటిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హిమజ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని మరింత ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా బిగ్ బాస్ తర్వాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో హిమజా ఎంతో బిజీగా గడపడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్నటువంటి అవమానాలు ఇబ్బందులను అలాగే బాడీ షేమింగ్ ట్రోల్స్ గురించి కూడా తెలియజేశారు.కెరియర్ మొదట్లో ఎంతోమంది తనని అవమానించారని ఈమె గుర్తు చేసుకున్నారు. ఇక తన నడక అమ్మాయిలా ఉండదని అబ్బాయిల నడకలా ఉండేది అంటూ కొందరు తనని బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారు. ఇక కొంతమంది డైరెక్టర్లు తన కళ్ళు ఏమాత్రం బాగుండవు అంటూ కామెంట్లో చేశారని ఆ సమయంలో తనకు చాలా ఏడుపొచ్చిందని ఈమె తెలిపారు.ఇలా అవమానించడంతో బాధపడి వెనక్కి తగ్గకూడదని మనం చేసే పని కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని తాను ధైర్యంతో ముందడుగు వేశానని తెలిపారు.
Bigg Boss Himaja: తన డ్రైవర్ పిల్లలను చదివిస్తున్న హిమజ…
ఇక ఏ డైరెక్టర్లు అయితే తన కళ్ళు బాలేవని చెప్పారో కళ్ళకు మేకప్ వేసిన తర్వాత వాళ్లే తన కళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటూ ప్రశంసించారని హిమజా తెలిపారు.ఇక చాలామంది సోషల్ మీడియా వర్క్ గురించి మాట్లాడుతుంటారు అయితే బయట మనం సమాజానికి సహాయం చేయడానికి అన్న ముందు మన ఇంట్లో మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయని తెలిపారు. అందుకే తాను తన కార్ డ్రైవర్ పిల్లలను చదివించే బాధ్యత తీసుకున్నానని తెలిపారు.తనకు ముగ్గురు ఆడపిల్లలు కాగా ఆ ముగ్గురి ఆడపిల్లల చదువు బాధ్యతలను తానే తీసుకున్నానని ఈ సందర్భంగా హిమజ తెలియచేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి.