Bigg Boss Jessie: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ లు చేయిస్తూ.. డాన్స్ తో పాటు, నవ్వుల వినోదాన్ని పంచుతున్న ఢీకార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈ కార్యక్రమం ఢీ 15 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ హీరోయిన్, శ్రద్ధా దాస్ జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉండగా ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సి మరొక యంగ్ యాంకర్ దివ్ నార్ని ఈ షోలో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు.
ఇకపోతే ఈ నెల 26వ తేదీ ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సిని టార్గెట్ చేయడమే కాకుండా తన పరువు మొత్తం తీసేశారు. ఎప్పటిలాగే డాన్స్ పెర్ఫార్మెన్స్ అయిన అనంతరం జెస్సీ యాంకర్ దివ్యని ఫ్లటింగ్ చేస్తూ ఎంట్రీ ఇస్తాడు. దివ్యకి బాగా చలిగా ఉందట అందుకే తనకు దగ్గరగా ఉన్నానని చెబుతాడు. జెస్సి ఇలా చెప్పగానే వెంటనే శేఖర్ మాస్టర్ వాళ్లకు వెచ్చగా ఉండాలి అంటే ముందు మనలో వేడి పుట్టాలి అంటూ కామెంట్ చేస్తారు.
Bigg Boss Jessie: మనలో వేడి పుట్టాలి…
ఇక యాంకర్ ప్రదీప్ సైతం మాట్లాడుతూ ఆరుగురు ప్రతివతలు సినిమాలో ఒక ఆయన కూర్చొని ఏడుస్తుంటారు నువ్వు ఆ టైప్ ఆ అంటూ ప్రదీప్ జెస్సి పరువు తీస్తాడు. ప్రదీప్ ఇలా అనగానే జెస్సి అసలు ఏమనుకుంటున్నారు నా గురించి ..నేనేంటో మీకు తెలియదు అని గంభీరంగా అనడంతో వెంటనే శ్రద్ధాదాస్ నాకు తెలుసు అని మాట్లాడుతుంది. తన గురించి గొప్పగా చెబుతుందని భావించిన జెస్సికి శ్రద్ధాదాస్ నుంచి ఘోర అవమానం ఎదుర్కొన్నారు. ఇక శ్రద్ధగా మాట్లాడుతూ నువ్వు పూజకు పనికిరాని పువ్వు అట కదా అంటూ దారుణంగా జెస్సినీ కామెంట్ చేశారు.ఇలా శ్రద్దదాస్ అనడంతో జెస్సి ఒక్కసారిగా తెల్ల మొహం వేసుకున్నాడు. అయితే ఈ ప్రోమో వైరల్ గా మారడంతో సరదాకి ఇలా మాట్లాడిన అందరి ముందు ఇలా ఒక వ్యక్తిపై వల్గర్ కామెంట్స్ చేయడం ఏంటి అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.