Bigg Boss Manas: పలు సినిమాలలో బాల నటుడిగా నటిస్తూ అనంతరం పలు సీరియల్స్ లో హీరోగా నటిస్తూ ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి వారిలో నటుడు మానస్ ఒకరు. ఇలా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మానస్ తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మానస్ త్వరలోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు కాబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మానస్ శ్రీజ అనే యువతితో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ఏంటి అని నేటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. శ్రీజ ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని తెలుస్తోంది.
ఓ ఇంటి వాడు కాబోతున్న మానస్…
ఇక వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం కావడం విశేషం ఇలా వీరిద్దరూ ప్రస్తుతం నిశ్చితార్థం జరుపుకోగా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అయితే వీరి పెళ్లి తేది ఎప్పుడు అనే విషయాలను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారని సమాచారం. ఈ విధంగా మానస్ నిశ్చితార్థం కావడంతో ఈ కార్యక్రమంలో పలువురు బుల్లితెర నటీనటులు హాజరై సందడి చేశారు. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఈ నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొని సందడి చేయడమే కాకుండా కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.