Bigg Boss Non Stop: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇద్దరు పిల్లల తల్లి అయిన తన చక్కటి అందంతో ఎంతోమంది మతి పోగొడుతుంది. ఇక ఈ అమ్మడి కోసం షో చూసేవారు కోట్లలో ఉన్నారు అని చెప్పవచ్చు. జబర్దస్త్ తో మంచి పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ క్రమంగా వెండితెరపై కూడా అడుగుపెట్టింది.
ఇక వెండితెర పై అడుగు పెట్టిన అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం నటిగా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతుంది. ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో ప్రాణం పోసిన పుష్ప సినిమాలో ఈ అమ్మడు మంగళం శీను భార్య ప్రేక్షకులను బాగానే మెప్పించింది.
మొత్తానికి ఈ సినిమాతో అనసూయ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అనసూయ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు తన గ్లామర్ అప్ డేట్స్, ఫ్యామిలీ అప్ డేట్స్ నెట్టింట్లో పంచుకుంటుంది. దాదాపు నాలుగు పదుల వయసు వచ్చినప్పటి తన అందంతో నెటిజన్ల కు గ్లామర్ విండును వడ్డీస్తుంది.

Bigg Boss Non Stop: బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన అనసూయ ఈ విధంగా హడావిడి చేసింది!
ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ఓటీటీ వెర్షన్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ రియాలిటీ షో ముగింపు దశకు రావడంతో తో అనసూయ హౌస్ లోకి వచ్చి హడావిడి చేస్తుంది. హౌస్ లో కంటెస్టెంట్ లందరికీ చిక్కుముడి ప్రశ్నలు వేసి కంటెస్టెంట్ లు ఆశ్చర్యపోయే విధంగా చేసింది. ఒక పలు ప్రశ్నలు ఇంగ్లీషులో అడుగుతూ ఒక రేంజ్ లో అనసూయ హౌస్ లో హడావిడి చేసింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా ఆ ప్రోమో పై ఒక లుక్కేయండి.