Bigg Boss Non Stop: బాలయ్య అంటే అదే మరి.. బిగ్ బాస్ హౌస్ లో బాలయ్య నినాదాలు!

Akashavani

Bigg Boss Non Stop: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తండ్రికి తగ్గ కొడుకు గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాలయ్య ప్రత్యేకమైన మ్యానరిజానికి యువ ప్రేక్షకులు సైతం ఫిదా అవుతారు. ఇక బాలయ్య అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

మొత్తానికి బాలయ్య టాలీవుడ్ అగ్ర స్టార్ట్ హీరోలలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక గతేడాది విడుదలైన అఖండ సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ను మరింత ఫిదా చేసాడు. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో బీ టౌన్ ప్రేక్షకులను సైతం మరో లెవెల్ లో ఆకట్టు కున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో బాలయ్య స్లొగన్స్ తెగ హడావిడి చేసాయి.

తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి గత సంవత్సరం సీజన్ విన్నర్ సన్నీ అడుగుపెట్టి హౌస్ లో ఒక రేంజ్ లో హడావిడి చేసాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం హౌస్ లో కంటెస్టెంట్ లు అందరూ పోటీ పడ్డారు. చివరికి ఫ్రీ పాస్ ను బాబా భాస్కర్ గెలుచుకున్నాడు. అనంతరం హౌస్ మెట్స్ తో సన్నీ సరదాగా గడిపాడు.

 Bigg Boss Non Stop: బాలయ్య అంటే అదే మరి.. బిగ్ బాస్ హౌస్ లో బాలయ్య నినాదాలు!
 Bigg Boss Non Stop: బాలయ్య అంటే అదే మరి.. బిగ్ బాస్ హౌస్ లో బాలయ్య నినాదాలు!

Bigg Boss Non Stop: బిగ్ బాస్ హౌస్ లో బాలయ్య నినాదాలు..

ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ ముగిశాక.. బిగ్ బాస్ బాలయ్య సాంగ్ ని ప్లే చేశాడు. దాంతో సన్నీతో సహా హౌస్ లో కంటెస్టెంట్ లు అందరూ జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ గట్టిగా హౌస్ లో హడావిడి చేశారు. ఆ తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యాక అందరూ టఫ్ ఫైట్ ఇస్తున్నారని సన్నీ ఒక్కొక్కరి గురించి చెప్పి వెళుతూ బాలయ్య డైలాగ్ విసిరాడు.

ఇక అక్కడ కూడా జై బాలయ్య అంటూ బిగ్ బాస్ హౌస్ లో పెద్ద ఎత్తున హడావిడి చేశారు కంటెస్టెంట్ లు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హడావిడి గా మారింది.

- Advertisement -