Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. రైతు బిడ్డగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ రైతు కష్టాలను తెలియజేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారిపోయారు. ఇలా యూట్యూబ్ వీడియోలు ద్వారా ఏదో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనాలనేది తనకల అంటూ ఈయన ఎన్నోసార్లు తన యూట్యూబ్ వీడియోలు ద్వారా తెలియజేయడంతో ఈసారి ఏకంగా ఈయనకు బిగ్ బాస్ అవకాశాన్ని అందించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈయన సెలబ్రిటీలకు పోటీగా పెర్ఫార్మన్స్ ఇవ్వడమే కాకుండా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన ఆట తీరు చూస్తుంటే మాత్రం తప్పకుండా టాప్ ఫైవ్ వరకు వెళ్తారని భావిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈయన అరుదైన రికార్డ్ సాధించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆర్మ్యాక్స్ మీడియా సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం అత్యంత పాపులారిటీ కలిగిన బుల్లెతెర సెలబ్రిటీలలో ఈయన టాప్ ఫోర్ లో నిలబడటం విశేషం.
ఆది సుధీర్ కు పోటీగా…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా కేవలం యూట్యూబ్ వీడియోలు ద్వారా సెలబ్రిటీగా గుర్తింపు పొందినటువంటి పల్లవి ప్రశాంత్ ఈ సర్వేలో నాలుగవ స్థానంలో నిలబడటమే కాకుండా హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వంటి వారికి కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ సర్వేలో మొదటి స్థానంలో ఆది ఉండగా రెండవ స్థానంలో సుధీర్ ఉన్నార. ఇక మూడో స్థానంలో జబర్దస్త్ కమెడియన్ సునామి సుధాకర్ ఉండగా నాలుగో స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉండటం విశేషం. ఇక ఐదో స్థానంలో శేఖర్ మాస్టర్ ఉన్నారు. ఇలా పల్లవి ప్రశాంత్ ఇంత పాపులారిటీని సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించడంతో రైతుబిడ్డ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.