Bigg Boss: బిగ్ బాస్ కార్యక్రమం సీజన్ సెవెన్ ప్రస్తుతం 11వ వారం కొనసాగుతుంది. మరొక నాలుగు వారాలలో ఈ కార్యక్రమం పూర్తి కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక 11వ వారంలో భాగంగా ఓటింగ్ దశ కూడా పూర్తి కావడంతో ఈ వారం ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ల గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఇక బిగ్ బాస్ కార్యక్రమం ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఇక ఈవారం పల్లవి ప్రశాంత్ శివాజీ మినహా మిగిలిన వారందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు అయితే పల్లవి ప్రశాంత్ శివాజీ లేకపోవడంతో వీరి అభిమానులందరూ కూడా యావర్ కి ఓట్లు వేయడంతో ఆయన మొదటి స్థానంలో ఉండగా అమర్ రెండో స్థానంలో ఉన్నాడు. గౌతమ్ కృష్ణ మూడో స్థానం రతిక నాలుగో స్థానం అశ్విని ఐదవ స్థానం అర్జున్ ఆరవ స్థానం చివరి రెండు స్థానాలలో ప్రియాంక శోభ శెట్టి ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కానుంది అని తెలుస్తుంది.
శోభ ప్రియాంక బయటకు రానున్నారా…
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటే చివరిగా ఉన్నటువంటి ప్రియాంక శోభ శెట్టి ఇద్దరు కూడా హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది కానీ వీరిని మాత్రం బయటకు పంపించే ప్రసక్తే లేదని బిగ్ బాస్ మొదటినుంచి పరోక్షంగా చెబుతూనే వచ్చారు మరి వీరిద్దరిని సేవ్ చేస్తే అశ్విని అర్జున్ బయటకు రాబోతున్నారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి మరి డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఈ వారం ఏ కంటెంట్ లు బయటకు రాబోతున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ వారం డబల్ ఎలిమినేషన్ కాకుండా ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండవచ్చని తెలుస్తోంది. గత సీజన్లో కూడా ఇలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగక అప్పుడు శ్రీ సత్య హౌస్ నుంచి బయటకు వచ్చారు. మరి ఈ సీజన్లో డబుల్ ఎలిమినేషన్ చేస్తారా లేదా అనేది తెలియాల్సిందే.