Bindu Madhavi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు హీరోయిన్ బిందుమాధవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆవకాయ బిర్యాని సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి బిందు మాధవి యాక్టర్ గా ఇండస్ట్రీలో బాగానే హడావిడి చేస్తోంది.
ఇదే ఫేమ్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో అడుగు పెట్టి ఓటీటీ ప్రేక్షకులందరినీ ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. కాగా తాజాగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ తన సొంతం చేసుకుంది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన అనంతరం ఈ అమ్మడు వరుస ఇంటర్వ్యూలలో బిజీ అయిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ అప్ డేట్స్ నెట్టింట్లో పంచుకుంటుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బిందుమాధవి పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే బిందుమాధవి పెళ్లి చేసుకోబోతుంది అని గాసిప్స్ వస్తున్నాయి. తాజాగా ఈ గాసిప్స్ పై బిందుమాధవి తండ్రి స్పందించాడు. ఆమెకు ఇష్టం ఉన్నప్పుడే పెళ్లి చేస్తామని చెప్పుకొచ్చాడు. ఆమె ఇంజనీరింగ్ చదివేటప్పుడు పెళ్లి లో చాలా ఒత్తిడి చేసినట్లు తెలిపాడు.

Bindu Madhavi: బిందుమాధవి తండ్రి పెళ్లి గురించి ప్రస్తావన తేక పోవడానికి కారణం ఇదే!
చాలా మంచి సంబంధాలు వచ్చాయి. పెళ్లి చేసుకోమని బిందుని ఒత్తిడి చేశాను. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. ఇక సినిమాలో అడుగుపెట్టిన తర్వాత కూడా చాలా సంబంధాలు చూసాను కానీ ఆమె ఒప్పుకోలేదు. నేను చూసుకుంటా నాన్న నేనేం చిన్నపిల్లని కాదు కదా.. నా మంచి చెడుల గురించి నాకు తెలుసు. నేను చెప్పినప్పుడు నా పెళ్లి చేయండి అని బిందు మాధవి చెప్పిందట. అప్పటి నుంచి ఆమె ఆకాంక్షలు, అభిలాష లకు నేను పూర్తిగా వదిలేశాను అని బిందుమాధవి తండ్రి చెప్పుకొచ్చాడు.