Bittiri Satti: బిత్తిరి సత్తి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన వేషధారణ, మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కెరియర్ మొదట్లో తీన్మార్ వార్తల ద్వారా అందరికీ పరిచయమైన బిత్తిరి సత్తి తన యాసతో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. బిత్తిరి సత్తిని చూడటం కోసమే కొందరు తీన్మార్ వార్తలు చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా కెరియర్ మొదట్లో తీన్మార్ వార్తలు ద్వారా వేలల్లో రెమ్యూనరేషన్ తీసుకున్న బిత్తిరి సత్తి అనంతరం న్యూస్ ఛానల్ మారుస్తూ తన రెమ్యూనరేషన్ కూడా పెంచేశారు.
ఇలా ఈయన నెలకు లక్షల్లో సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బిత్తిరి సత్తి ప్రముఖ హీరోలను కూడా ఇంటర్వ్యూ చేస్తూ భారీగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ విధంగా ఈ మధ్యకాలంలో బిత్తిరి సత్తి పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఈయన ఇంటర్వ్యూలు చేయడం కోసం ప్రముఖ యాంకర్ లను మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కో ఇంటర్వ్యూ కోసం బిత్తిరిసత్తి ఏకంగా రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

Bittiri Satti: లక్షల్లో సంపాదన…
ఈ విధంగా ఇంటర్వ్యూలు అదే విధంగా పలు కార్యక్రమాల ద్వారా ఇతను నెలకు సుమారు 5 నుంచి 7 లక్షల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. ఈ విధంగా ఈయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిసి ఎంతో మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా బిత్తిరి సత్తి న్యూస్ ఛానల్ ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా అందరినీ సందడి చేయడమే కాకుండా పలు సినిమాలలో కూడా నటించారు. మొత్తానికి బిత్తిరిసత్తి అతి తక్కువ సమయంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకొని ప్రస్తుతం ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.