Ranveer : బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కొంతమేర ఫాస్ట్ కల్చర్ ఉంటుందని అందరికీ తెలిసిందే. అంతేకాకుండా సినిమాల పరంగా కూడా ఇక్కడ మార్కెట్ బాగా ఎక్కువగా ఉంటుంది. దీంతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మైండ్ సెట్ అలాగే సంపాదన కూడా కొంత డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. కాగా బాలీవుడ్ లో దాదాపుగా డజనుకు పైగా చిత్రాల్లో హీరోగా నటించి బాగానే ఆకట్టుకున్న ప్రముఖ హీరో రణవీర్ సింగ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే నటుడు రణవీర్ సింగ్ ఎప్పుడూ కూడా విభిన్న కథనాలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఎప్పుడూ రొటీన్ గా కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో కూడా నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో రణవీర్ సింగ్ రెమ్యూనరేషన్ పరంగా కూడా దాదాపుగా 50 నుంచి 75 కోట్ల రూపాయల అందుకుంటున్నట్లు సమాచారం.
అయితే తాజాగా రణవీర్ సింగ్ ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా గత రెండు రోజులుగా నటుడు రణవీర్ సింగ్ మరియు ఈ ఫోటోషూట్ కార్యక్రమం గురించి బాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందిస్తూ రణవీర్ సింగ్ నిజంగా గ్రేట్ అని అంతేకాకుండా సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి ఓ వ్యక్తి ఇలా నగ్న ప్రదర్శన చేయడానికి ఒప్పుకోవడం అంటే సామాన్యమై న విషయం కాదని అంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ నటి మరియు మోడల్ మసాబా గుప్తా కూడా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా ద్వారా నటుడు రణవీర సింగ్ ఫోటోలపై స్పందించింది. ఇందులో భాగంగా రణవీర్ సింగ్ నిజంగా గ్రేట్ అని అంతేకాకుండా ఇలాంటి ఫోటోషూట్లో పాల్గొనడానికి చాలా ధైర్యం కావాలని రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్ చేసింది. దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ మసాబా గుప్తా చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నగ్న ప్రదర్శనలు చేయడానికి ధైర్యం అవసరం లేదని కేవలం ఒంటిపై బట్టలు లేకుండా ఫోటోలకు ఫోజులిస్తే చాలని అలాగే నగర ప్రదర్శనలను సపోర్ట్ చేయడం మంచిది కాదని ఫైర్ అవుతున్నారు.
ఇంకొందరైతే ఏకంగా దేశ బార్డర్ లో చాలామంది సైనికులు కాపలాకాస్తు ప్రాణాలను పనంగా పడుతున్నారని అలాంటి వాళ్ళని సెలబ్రిటీలు అభినందించరని, కానీ ఇలా బట్టలిప్పి నగ్న ప్రదర్శనలు చేసేవాళ్ళు మాత్రం గ్రేట్ అని చాలా ధైర్యవంతులను పొగుడుతున్నారంటూ మరికొందరు అంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటుడు రణవీర్ సింగ్ హిందీలో సర్కస్ మరియు రాఖీ ఆర్ రాణి కీ ప్రేమ కహాని తదితర చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నాయి. అయితే ఉన్నట్లుండి నటుడు రఘువీర సింగ్ ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్న ప్రదర్శన చేయడంతో ఈ ప్రభావం కాస్త తన తొదుపరి చిత్రాలపై పడుతుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.