Shilpa Shetty : బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బ్యూటిఫుల్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు తెలుగులో కూడా ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సాహస వీరుడు సాగర కన్య అనే చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా కనిపించింది.
కానీ ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ బ్యూటీకి గుర్తింపు లభించలేదు. దీంతో అప్పటినుంచి మళ్లీ ఈ అమ్మడు టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది. అయితే తాజాగా నటి శిల్పాశెట్టి బయటికి వచ్చిన సమయంలో చేసినటువంటి ఓ పని ఈ కారణంగా సోషల్ మీడియా మాధ్యమాలలో నెగిటివ్ ట్రోలింగ్ ని ఎదుర్కుంటుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవల నటి శిల్పాశెట్టి ముంబై లో జరిగినటువంటి ఓ ప్రముఖ ఇంటికి అతిథిగా హాజరైంది. అయితే ఈ సమయంలో కొందరు వీడియో గ్రాఫర్లు ఈ అమ్మడిని ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. అయితే శిల్పా శెట్టి తాను ధరించిన దుస్తుల కారణంగా కొంతమేర అసహనానికి గురయింది. అంతేకాకుండా పబ్లిక్ లోనే తన దుస్తులను సవరించుకుంటూ కనిపించింది. ఈ సంఘటనని వీడియో తీసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ సౌకర్యంగా లేనటువంటి దుస్తులను ధరించి పబ్లిక్ లోకి వస్తే ఇలాంటి అభాసుపాలయ్యే సంఘటనలు జరుగుతాయని కాబట్టి ఇకనుంచైనా పద్ధతిగా దుస్తులు ధరించి బయటకు రావాలని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలాఉండగా ఈ మధ్యకాలంలో నటి శిల్పాశెట్టి ఎక్కువగా తాను నటించినటువంటి చిత్రాలతో కంటే వివాదాలతోనే బాగా పాపులర్ అవుతోంది. కాగా ఆ మధ్య నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఏకంగా మనీలాండరింగ్ మరియు అశ్లీల చిత్రాల చిత్రీకరణ వ్యవహారంలో పోలీసులకు చిక్కి ఒక్కసారిగా పెను దుమారం సృష్టించారు. దీంతో కొన్ని రోజుల పాటు నటి శిల్పాశెట్టి సినిమా ఇండస్ట్రీ లో జరిగే కార్యకలాపాలకు దూరంగా ఉంది. కానీ ప్రస్తుతం ఈ విషయం సర్దమనగడంతో మళ్ళీ శిల్పా శెట్టి సోషల్ మీడియాలో మరియు సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ అయింది.