Esha Gupta : గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మాధ్యమాలలో ఘాటు అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి కునుకులేకుండా చేస్తోంది హాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇషా గుప్తా. అయితే ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఈ అమ్మడికి సెకండ్ హీరోయిన్ మరియు స్పెషల్ సాంగ్స్, కామియో అప్పీయారెన్స్ వంటి పాత్రల్లో నటించే ఆఫర్లు మాత్రమే వరించాయి. దీంతో ఈ బ్యూటీ మెయిన్ హీరోయిన్ కాలేకపోయింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా నటనలో మరిన్ని మెళుకువలు నేర్చుకొని అప్పుడప్పుడు నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కూడా నటించి లేడీ ఓరియంటెడ్ పాత్రలకే తాను పర్ఫెక్ట్ ఛాయిస్ అని నిరూపించుకుంది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్లకి కూడా లేనటువంటి లేనటువంటి క్రేజ్ ఏర్పడింది.
అయితే ఈ మధ్యకాలంలో నటి ఇషా గుప్తా ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఘాటుగా ఫోటోషూట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కాగా తాజాగా ఈ అమ్మడు స్లీవ్ లెస్ జాకెట్ దుస్తులు ధరించి చీరలో దిగినటువంటి ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలలో నటి ఇషా గుప్తా కనిపించీ కనిపించకుండా యద అందాలు ఆరబోస్తూ కొంతమేర క్లీవేజ్ షో చేస్తూ బోల్డ్ గా కనిపిస్తూ మతి పోగొట్టింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అంతేకాకుండా చీరలో కూడా అంతగా అందాలు ఆరబోయవచ్చని ఇషా గుప్తా ఫోటోలు చూస్తే తెలిసిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయంలో ఇలా ఉండగా ప్రస్తుతం నటి ఇషా గుప్తా బాలీవుడ్ లో ఒక పక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్ లు అంటూ బిజీబిజీగా గడుపుతోంది. ఇటీవలే ఈ అమ్మడు బాలీవుడ్ లో మంచి హిట్ అయిన ఆశ్రమ్ వెబ్ సిరీస్ లో నటించి బోల్డ్ గా కనిపించింది. ఈ వెబ్ సిరీస్ లో నటి ఈషా గుప్తా మరియు స్వామీజీల మధ్య వచ్చేటువంటి బోల్డ్ సన్నివేశాలు మొత్తం వెబ్ సిరీస్ కి హైలెట్ గా నిలిచాయి. కాగా ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్ లో ప్రసారమవుతుంది. ఇటీవలే నటి ఇషా గుప్తా బాలీవుడ్ లో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించే ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే భారీ మొత్తంలో పారితోషకం తీసుకుంటున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.