Bollywood తరచూ ఎంతోమంది నటీనటులు ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం దక్కించుకొని తమ ప్రతిభను నిరూపించుకోవడానికి చలనచిత్ర పరిశ్రమకి వస్తుంటారు. ఈ క్రమంలో కొందరికి సులభంగా అవకాశాలు వరిస్తే మరికొందరికి మాత్రం అవకాశాల విషయంలో చాలా ఇబ్బందులు, అవమానాలు ఎదురవుతాయి. ఇంకొందరైతే అవకాశాల విషయంలో ప్రయత్నించి అలసిపోయి అడ్డదారుల్లో అవకాశాలు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో లేకపోలేదు. అయితే తాజాగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ యంగ్ హీరోయిన్ గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఆర్థికంగా బాగానే సెటిల్ అయినటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఓ యంగ్ హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నించి ఒకటి, రెండు చిత్రాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ పెద్దగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోలేకపోయిందట. దీంతో ఈ హీరోయిన్ ఏకంగా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో పలు చిత్రాలకు నిర్మాతగా మరియు దర్శకుడి గా వ్యవహరించి నటువంటి ఓ సీనియర్ దర్శకుడితో లవ్ ఎఫైర్ పెట్టుకుందని అయితే ఆ సీనియర్ దర్శకుడికి దాదాపుగా 60 సంవత్సరాలు పైబడి వయస్సు ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఆ దర్శకుడికి తన ప్రియురాలు వయసున్నటువంటి కూతురు కూడా ఉందని అలాగే ఆ దర్శకుడు కూతురు ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తుందని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే అవకాశాల కోసం ఈ యంగ్ హీరోయిన్ చేసిన తప్పులు కారణంగా తన ప్రియుడు కూడా ఆ మధ్య ఆత్మహత్య చేసుకొని మరణించాడని ఆ మధ్య యంగ్ హీరోయిన్ గురించి పలు వార్తలు బలంగా వినిపించాయి. అంతేకాకుండా ఈ యంగ్ హీరోయిన్ ఇటీవలే మత్తుమందు పదార్థాల వినియోగం మరియు సరఫరా కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో 60 ఏళ్ల సీనియర్ దర్శకుడు మరియు ఆ యంగ్ హీరోయిన్ ఎవరా…? అని సోషల్ మీడియాలో కొందరి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.
ఏదేమైనప్పటికీ అవకాశాల విషయంలో అడ్డదారులు తొక్కిన హీరోయిన్ కి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సినిమా ఆఫర్లు బాగానే వివరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే ఈ హీరోయిన్ కి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కూడా ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం వరించినట్లు పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.