Bommarillu: సాధారణంగా కొన్ని సినిమాలు హీరో వల్ల హిట్ అవుతుంటే మరికొన్ని ఆ సినిమా స్టోరీ , పాటల వల్ల హిట్ అవుతూ ఉంటాయి. అయితే టైటిల్ వల్ల హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాలలో బొమ్మరిల్లు సినిమా కూడా ఒకటి. సిద్ధార్థ్ జెనీలియా జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా బొమ్మరిల్లు ఈ సినిమా విడుదలై ఎవరు ఊహించని విధంగా సంచలన విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకి ఐదు రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టింది.
ఈ సినిమాలో సిద్దార్థ్ ఎమోషనల్ యాక్టింగ్ తో పాటు జెనీలియా అల్లరి కూడా యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పటికి ఈ సినిమా ఎంతోమందికి ఫెవరెట్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ట్రెండింగ్ ఉన్నాయి అనటంతో సందేహం లేదు. ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాకి టైటిల్ విషయంలో మాత్రం దిల్ రాజు తీసుకున్న నిర్ణయం ప్లస్ పాయింట్ గా మారిందని తెలుస్తోంది. సాధారణంగా ఒక సినిమాకి టైటిల్ సెట్ చేయడానికి ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకొని టైటిల్ నిర్ణయిస్తారు.

Bommarillu: ఇన్విటేషన్ చూసి టైటిల్ ఫిక్స్ అయ్యారా..
కొందరు దర్శకులు వారి సెంటిమెంట్ లెటర్స్ తో టైటిల్ ఉండేలా జాగ్రత్త పడతారు.కానీ బొమ్మరిల్లు సినిమా టైటిల్ విషయంలో భాస్కర్ తీసుకున్న నిర్ణయం ఇప్పటికి సినిమా మేకర్స్ కి నవ్వులు తెప్పిస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఈ సినిమా షూటింగ్ కి సిద్ధమైన తర్వాత టైటిల్ ఏం పెట్టాలి అని మేకర్స్ ఆలోచిస్తున్న క్రమంలో దిల్ రాజుకు వైవిఎస్ చౌదరి ఇచ్చిన ఇన్విటేషన్ ని భాస్కర్ చూశాడట. అందులో కార్డుపై బొమ్మరిల్లు అనే పేరు చూడగానే దిల్ రాజుకి కూడా ఆ విషయం చెప్పగా దిల్ రాజు సైతం ఇంప్రెస్ అయిపోయి సినిమాకి బొమ్మరిల్లు అని టైటిల్ ఫిక్స్ అయ్యారట . ఇలా టైటిల్ విషయంలో భాస్కర్ తీసుకున్న ఒక ఫన్నీ డెసిషన్ ఆ సినిమాని సూపర్ హిట్ చేసింది.