Brahmamudi November 11 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రాజ్, కావ్య ఇద్దరు ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు మన సంగతి ఎప్పుడూ ఉండేది కానీ భోజనం చేయండి అనడంతో నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నేను తినను అని అంటాడు రాజ్. అయినా దెబ్బ కొట్టి ఆయింట్మెంట్ రాస్తాను అంటే ఇక్కడ రాయించుకోనే వాళ్ళు ఎవరూ లేరు అనడంతో మీకు ఇలా కాదు మీరు అనే ఆ మోసం చేసే మీ చేత అన్నం తినేలా చేస్తాను అని చెప్పి కావ్య అన్నం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి చిన్న అత్తయ్య నేను చెప్పింది మొత్తం గుర్తుంది కదా అనడంతో ఆ గుర్తుంది కావ్య అని అంటారు. అప్పుడు అపర్ణ బయటకు రావడం చూసి ఏంటి చిన్నత్తయ్య మీరు మాట్లాడేది మీరు ఆ పని చేస్తారా అని అనడంతో నేను చిన్నప్పటినుంచి వాడిని పెంచిపెద్ద చేశాను ఆ మాత్రం చేయలేనా అని అంటుంది ధాన్యలక్ష్మి.
అపర్ణని రెచ్చగొట్టిన ధాన్యలక్ష్మి, కావ్య
చేయలేరు అనే కదా చెబుతున్నాను మీరే కాదు మా అత్తయ్య వచ్చినా కూడా తినిపించలేదు అని అంటుంది కావ్య. అదేంటి కావ్య అంత మాట అన్నావు అంటూ అపర్ణకు వినిపించే విధంగా గట్టిగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. అప్పుడు ఏం జరిగింది అని అపర్ణ అడగడంతో కావ్య చెప్పడానికి ప్రయత్నించగా నిన్ను ఎవడు అడిగాడు నేను దాన్యలక్ష్మి అడిగాను నువ్వు మౌనంగా ఉండు అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మీ రాజ్ భోజనం చేయడం లేదు కావ్య తీసుకుని వెళ్ళిన తినడం లేదంట అక్క అని అంటుంది. అప్పుడు అపర్ణ చేయాల్సినవన్ని చేసి భోజనం పెడితే ఎవరు తింటారు అని అంటుంది. రాజ్ తన మాటే కాదు ఎవరి మాట వినే పరిస్థితులలో లేడు అని అంటుంది అని అపర్ణను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది.
అనుకున్నది సాధించిన కావ్య
అప్పుడు కావ్య, ధాన్య లక్ష్మీ ఇద్దరు కలిసి అపర్ణని మరింత రెచ్చగొట్టి రాజ్ కి అన్నం తీసుకుని వెళ్లేలా చేస్తారు. అప్పుడు అపర్ణ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో నువ్వు సూపర్ కావ్య అని కావ్యని పొగుడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. మరొకవైపు రాజ్ ఆకలితో అలమటిస్తూ ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు భోజనం తీసుకురావడంతో ఆ కలావతి తెస్తే తినలేదని నీతో పంపించిందా అనడంతో ఒకరు చెప్పడం కాదు రాజు ఇన్నాళ్లు నేనే కదా నీకు అన్నం పెట్టింది అని రాజ్ కి మంచి మాటలు చెప్పి గోరుముద్దలు తినిపిస్తుంది అపర్ణ. అప్పుడు రాజ్ భోజనం చేస్తుండగా అది తలుపు చాటు నుంచి కావ్య, ధాన్యలక్ష్మి ఇద్దరు తలుపు చాటు నుంచి చూసి సంతోషపడుతూ ఉంటారు.
సంతోషంలో కావ్య, ధాన్యలక్ష్మి
అప్పుడు ధనలక్ష్మి కావ్య ను చూసి సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత అపర్ణ అక్కడికి వచ్చి ఇక్కడ ఎవరో చాలెంజ్ చేసినట్టు ఉన్నారు కదా దాన్యలక్ష్మి ఇప్పుడైనా తెలిసిందా ఈ అపర్ణ అంటే ఏంటో అని కోడలు వైపు చూసి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది అపర్ణ. తర్వాత కావ్య గదిలోకి వెళ్లి సంతోష పడుతూ నిద్రపోతుండగా నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు నాకు తెలుసు నువ్వు తినలేదని మమ్మీతో పంపించావు కదా అనడంతో అయ్యో ఈ విషయం నాకు అసలు తెలియదండి అనడంతో ఈ ఓవరాక్షన్ తగ్గించుకో అని అంటాడు రాజ్. మీ అమ్మగారు మీకోసం స్వయంగా చేసుకోవచ్చారు అనడంతో ఎవరి వంటో తెలియదా అది నువ్వే చేశావని నాకు బాగా తెలుసు అనడంతో కావ్య సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయం అందరినీ హాల్లోకి రమ్మని చెబుతాడు సీతారామయ్య. అప్పుడు సుభాష్ ఏమైంది నాన్న ఎందుకు రమ్మని పిలిచారు అనడంతో కొద్దిసేపు ఆగు అని అంటాడు.
సంతోషపడుతున్న రుద్రాణి రాహుల్
ఇంతలోనే అక్కడికి లాయర్ రావడంతో అందరూ షాక్ అవుతారు. మీరు చెప్పినట్టుగానే నేను వీలునామా రాసుకొచ్చాను సార్ అనడంతో రుద్రాణి, రాహుల్ ఇద్దరు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు చిట్టి సుభాష్ అవసరమా ఇవన్నీ అని అనడంతో మీరు కాసేపు మౌనంగా ఉండండి అని అంటాడు సీతారామయ్య. అప్పుడు అందరికీ మంచి మాటలు చెబుతాడు సీతారామయ్య. రుద్రాణి మాత్రం ఎప్పుడెప్పుడు ఆ వీలునామా చదువుతాడా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో అందరూ వీలునామా చదవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎలా ఉన్నామో అందరం అలాగే ఉంటాము అని ఎంత చెప్పినా కూడా సీతారామయ్య వినిపించుకోడు. నేను ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను నా మనసులో ఏముందో మీకు చెప్పాల్సిన సమయం వచ్చింది. కాబట్టి దయచేసి ఎవరూ అడ్డుపడకండి అని అంటాడు సీతారామయ్య.
Brahmamudi November 11 Today Episode: సంతోషంలో రాజ్ ఫ్యామిలీ
లాయర్ గారు మీరు చదవండి అనడంతో రుద్రాణి రాహుల్ సంతోషపడుతూ ఉంటారు. లాయర్ గారు చదవబోతుండగా రాజ్ వచ్చి ఆ పేపర్స్ తీసుకొని చింపేయడంతో అందరూ సంతోషపడుతుండగా రుద్రాణి రాహుల్ మాత్రమే షాక్ అవుతారు. రాజ్ ప్రవర్తనకు షాక్ అయిన సీతారామయ్య రాజ్ ఏంటిది అనడంతో నేను మీ మాటలు ఎదిరించి ఈ పని చేయడం లేదు. దయచేసి ఈ పని ఇంతటితో ఆపేయండి అని అంటాడు రాజ్. నీకు ఆరోగ్యం బాగో లేకపోయినప్పుడు మేము ఆస్తి పంచుకోవడంలో అర్థం లేదు తాతయ్య మేము మనుషులం అనడంతో చిట్టి క్లాప్స్ కొడుతూ శభాష్ మనవడా. వీడు నా అసలైన మనవడు దుగ్గిరాల వంశానికి వారసుడు అని రాజ్ ని పొగడడంతో రాహుల్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు ధాన్యలక్ష్మి ఏంటి రుద్రాణి ముఖం మాడిపోయింది అనడంతో చేసేదేమీ లేక రాజ్ అన్నట్టుగానే మనమందరం ఒకటిగానే ఉందాం అని నాటకాలు ఆడుతూ ఉంటుంది రుద్రాణి.