Brahmamudi November 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కావ్య సరదాగా మాట్లాడుతూ ఇంతవరకు వంట పని చేసి వస్తున్నాను అని అంటుంది. అప్పుడు రాజ్ స్మార్ట్ గా మాట్లాడకు అనడంతో కావ్య సిగ్గుపడుతూ అందరూ స్మార్ట్ గా ఉంటానని అంటారు కానీ మీరు స్మార్ట్ గా మాట్లాడుతున్నానని అంటున్నారు అంటుంది. అప్పుడు జరిగిన విషయం గురించి ఇద్దరు ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు ఏంటే ఈ డ్రామా అని రాజ్ ఇరిటేటింగ్ గా అడగడంతో డ్రామా అని అంటుంది కావ్య. ఏంటి అనడంతో ప్రేమ నాటకం. నటిస్తే ఎలా ఉంటుందో అనేది ఇలా చూపించాను అనడంతో రాజ్ ఆశ్చర్యపోతాడు. మన ప్రేమ చెల్లాచెదురు అయిపోయింది. మా అక్క చేసిన పనికి నీ దృష్టిలో నేను చెడ్డదాని అయ్యాను.
కావ్య మాటలకు ఆలోచనలో పడ్డ రాజ్
ఆడపిల్ల అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఎవరు ఏమంటాటో తెలియదు అని కావ్య బాధగా మాట్లాడుతుంది. అప్పుడు కావ్య మాటలకు రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత నా కాపురం కురుక్షేత్రం అయింది. ఇంటి కోడలికి ఎటువంటి కవచాలు ఉండవు సున్నితమైన మనసు మాత్రమే ఉంటుంది. మాట పదవి దాటకూడదు అడుగు గడప దాటకూడదు. బయటికి వెళ్తే సమాజం నా గురించి కథలుగా రాస్తుందని భయపడి ఇక్కడే నన్ను నేను సమాధి చేసుకుంటున్నాను అని బాధగా మాట్లాడుతుంది కావ్య. నేను ఇటువంటి తప్పు చేయలేదు కానీ ఒక నిజం దాచాను. కానీ అది నీ దృష్టిలో నేరం దానికి నేను ఏమి చేయలేను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
స్వప్న ఫొటోస్ చూసి షాకైన చిట్టి
అప్పుడు కావ్య అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రాజ్ ఆలోచనలో పడతాడు. తర్వాత హాల్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా రాహుల్ పైన నిలబడి నవ్వుతూ ఉండగా ఇంతలో అక్కడికి రుద్రాణి వస్తుంది. రుద్రాణి రాహుల్ ఇద్దరు కొరియర్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో కొరియర్ వస్తుంది. అప్పుడు ధాన్యలక్ష్మి వెళ్లి ఆ కొరియర్ ని తీసుకువచ్చి చిట్టికి ఇస్తుంది. చిట్టి ఆ కొరియర్ ని ఓపెన్ చేసి చూడగా అందులో అరుణ్ స్వప్న ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు చూసి షాక్ అవుతుంది. అప్పుడు రాహుల్ రుద్రాణి సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు అపర్ణ వచ్చి ఏంటి అత్తయ్య అవి అని అడగగా ఏమీ లేదు మీ మామయ్యా రిపోర్ట్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిట్టి. తర్వాత చిట్టి నేరుగా వెళ్లి స్వప్నకు అరుణ్ ఫోటోలు చూపించడంతో స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతుంది.
స్వప్న మాటలకు షాక్ అయినా రాహుల్
అది చూసి రాహుల్,రుద్రాణి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అరుణ్ ఫోటో చూపించి ఎవరు ఈ అబ్బాయి అని అడగగా స్వప్న ఏమీ తెలియనట్టుగా ఎవరు ఈ అబ్బాయి అని రివర్స్ లో ప్రశ్నిస్తుంది. ఆ మాటలకు రాహుల్ షాక్ అవుతాడు. అప్పుడు చిట్టి ఏమి మాట్లాడకుండా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రాహుల్,రుద్రాణి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడేం భయపడకు రాహుల్ మా అమ్మ మనసులో బీజాన్ని నాటాము దాన్ని మరింత బలం చేస్తాను. అప్పుడు ఏం జరుగుతుందో చూడు అని అంటుంది రుద్రాణి. అప్పుడు స్వప్న అరుణ్ కి ఫోన్ చేయగా అరుణ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దీని వెనక ఎవరు ఉన్నారో అడిగి తెలుసుకుంటాను అని అంటుంది. ఆ తర్వాత కనకం అప్పు గది క్లీన్ చేయడానికి వెళ్ళగా అప్పుడు దుప్పటి తీయడంతో అందులో ఐ లవ్ యు కళ్యాణ్ అని రాసి ఉంటుంది.
కూతురి చెంప చెల్లుమనిపించిన కనకం
అది చూసి కనకం ఒక్కసారిగా షాక్ అవుతుంది. బయటకు వెళ్లి అప్పుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడంతో అప్పు వాళ్ళ పెద్దమ్మ వచ్చి అడ్డుపడుతుంది. ఏమి జరిగింది అలా కొడుతున్నావు ఏం జరిగింది అని నిలదీస్తుంది. ఇప్పుడు కనకం వెళ్లికళ్యాణ్ ఫోటో తీసుకొని వచ్చి చూపించడంతో అప్పు వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు షాక్ అవుతారు. నాకు ఈ విషయం ముందే తెలుసు అని అంటుంది. దాంతో కనకం ఒక్కసారిగా షాక్ అవుతుంది. తెలిసి కూడా నాకు ఎందుకు చెప్పలేదు అనడంతో నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావని నాకు తెలియదు అని ఎంతో చాలా మంచి పని చేశావు అని అంటుంది కనకం. ఏం చేస్తున్నావ్ తెలుస్తోందా అక్క ఇప్పటికే ఇద్దరు కూతుళ్ళని ఆ ఇంటికి కోడలుగా పంపించినందుకు వాళ్ళ అత్తగారు నన్ను ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు.
Brahmamudi November 16 Today Episode: భర్తకి అబద్ధం చెప్పినా కనకం
ఇప్పుడు దీన్ని పంపిస్తే నన్ను వాళ్లు బ్రతకనిస్తారా అని అంటుంది. అక్కడ ఇన్ని గొడవలు జరుగుతున్నాయో ఆ స్వప్న చేసిన పనికి ఎంత రాద్ధాంతం అవుతుందో తెలిసి కూడా ఇది ఎలా ప్రేమించింది అని కనకం ఎమోషనల్ అవుతుంది.. అప్పుడు కనకం వెళ్లి కొట్టబోతుండగా కృష్ణమూర్తి వచ్చి అడ్డుపడతాడు. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఇద్దర్ని చంపేస్తారు వెళ్లిపోవడంతో అప్పు అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు కృష్ణమూర్తి ఏం జరిగింది అని అడగగా అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది కనకం.