Brahmamudi November 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కృష్ణమూర్తి ఎందుకు దాని మీద చేయి ఎత్తావు. ఎందుకు అలాగా ఉంది అనడంతో అదేం లేదు నా ముఖమే ఇంత అనడంతో ఏంటే కొత్తగా మాట్లాడుతున్నావు అనడంతో ఏం లేదు మీకు భోజనం వడ్డిస్తాను అనడంతో అప్పు తినిందా అనగా వాళ్ల పెద్దన్న పెడుతుంది మీరు కడుక్కొని రండి అని కనకం అక్కడినుంచి కవర్ చేసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత వంట గదిలోకి వెళ్ళిన కనకం అప్పు చేసిన పనిని తలచుకొని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు రాజ్ ఫ్యామిలీ అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు భోజనానికి వెళ్తే అందరూ కలిసి అరుణ్ అడుగుతారు ఏమో అని అక్కడ నిలబడి ఆలోచిస్తూ ఉండగా రాహుల్ స్వప్న వైపు చూసి నీ కోడలు భయపడుతోంది తినకుండా అలాగే వెళ్ళిపోతుంది ఏమో అనడంతో నేను వెళ్ళను కదా అని అంటుంది రుద్రాణి.
కోడలిపై ప్రేమ చూపిస్తున్న రుద్రాణి
అప్పుడు స్వప్న వెళ్ళిపోతుండగా రా స్వప్న టిఫిన్ వేడిగా ఉంది వచ్చి తిను అని ప్రేమ చూపిస్తుంది రుద్రాణి. అప్పుడు స్వప్న వచ్చి టిఫిన్ తినడానికి కూర్చోగా చిట్టి స్వప్న వైపు కోపంగా అలాగే చూస్తూ ఉండడంతో స్వప్న టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రుద్రాణి కావాలనే చిట్టిని రెచ్చగొట్టాలని ఏంటమ్మా నా కోడలు వైపు అలా చూస్తున్నావు ఏమైనా అడగాలి అనుకుంటున్నావా అనగా ఏం లేదు అని అంటుంది చిట్టి. అప్పుడు స్వప్న టిఫిన్ తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రాజ్ టిఫిన్ తినడానికి వచ్చి నటించే నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఏంటి కళావతి నేను వస్తే టిఫిన్ పెట్టావా అని అందరి ముందు అడగడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు కావ్య రాజ్ ఇద్దరు ఒకరిని మించి ఒకరు నటిస్తూ అందరిని నమ్మిస్తూ ఉండగా అందరూ అది నిజమని అనుకొని నవ్వుతూ ఉంటారు.
భార్యపై ప్రేమను కురిపిస్తున్న రాజ్
అప్పుడు అందరి ముందు కావ్య కూడా భర్తపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది. రాజ్ కూడా కావ్యకి అది వడ్డించు ఇది వడ్డించు అని ఆర్డర్లు వేస్తూ ఉంటాడు. అప్పుడు అందరి ముందు భార్యపై ప్రేమ ఉన్నట్లు నటించడంతో అపర్ణ కోపంగా చూస్తూ ఉంటుంది. దాంతో రాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటాడు. తర్వాత రాజ్ టిఫిన్ చేసి చేతులు కడుక్కోవడానికి వెళ్లగా అప్పుడు కావ్య కావాలనే తుడుచుకోవడానికి తన శారీ ఇచ్చి ఏంటండీ ఇది తుడుచుకోవడానికి న్యాప్ కిన్ ఇస్తున్నాను కదా నా చీరతో తుడుచుకున్నారేంటి అని అందరికీ వినిపించేలా అరుస్తుంది. అప్పుడు సుభాష్ చిన్నప్పుడు వాడు వాళ్ళ అమ్మ చీరకు అలాగే తుడిచేవాడు అనడంతో అబ్బా మీ అమ్మ స్థానాన్ని నాకు ఇచ్చారా అని అనడంతో అపర్ణ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
భర్తని ఆట పట్టిస్తున్న కావ్య
మరొకవైపు గదిలోకి వెళ్లిన స్వప్న ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ తో చచ్చిపోతున్నాను అనుకుంటూ ఉంటుంది. దీనంతటికీ కారణం ఆ అరుణ్ గాడే అని అరుణ్ కి ఫోన్ చేస్తుంది. అరుణ్ ఫోన్ కట్ చేయడంతో వీడు ఎందుకు నా ఫోన్ కట్ చేస్తున్నాడు ఏదో జరుగుతోంది అని అనుకుంటూ ఉంటుంది స్వప్న. రాహుల్ కి ఫోన్ చేసి స్వప్న పదేపదే ఫోన్ చేస్తోంది అనగా తను నా భార్య నాకు ఏం చేయాలి నీకెందుకు నేను చెప్పే వరకు ఫోన్ చేయకు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు చిట్టి రావడం చూసి రాహుల్ దొంగ ఏడుపులు ఏడుస్తూ స్వప్న, అరుణ్ ఫోటో చూసి బాధపడుతున్నట్లు నటిస్తూ ఉంటాడు. అప్పుడు కావాలనే ఆ ఫోటో నలిపి అక్కడ వేసి వెళ్ళిపోతాడు. ఆ ఫోటో చూసిన చిట్టి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
Brahmamudi November 17 Today Episode: రాజ్ కి అసలు విషయం చెప్పాలనుకున్న చిట్టి
రాహుల్ కి ఈ విషయం ముందే తెలిసినట్టుంది. అందుకే బాధపడుతున్నాడు లాభం లేదు ఈ విషయం రాజ్ కి చెప్పి ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటుంది చిట్టి. ఆ తర్వాత అప్పు ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉండగా కనకం అక్కడికి వచ్చి జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తల్లి కూతుర్లు ఇద్దరు ఎమోషనల్ అవుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అప్పు కన్నీళ్లు పెట్టుకొని కళ్యాణ్ గురించి మాట్లాడడంతో అది చూసి కనకం కూడా ఎమోషనల్ అవుతుంది. నాకు వాడు దూరం కాలేదు కానీ అనామి కదా వచ్చిన తర్వాత వాడు ఆ పిల్లకు దగ్గరయ్యాడు. నేను అది చూసి తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. అప్పుడు అప్పు ఏడుస్తూ తన తల్లి గుడిలో తల పెట్టుకుని పడుకుంటుంది. కనకం అప్పుని ఓదారుస్తూ ఉంటుంది. ఆ తర్వాత కావ్య రాజ్ ని ఆటపట్టించాలని బుక్ చదువుతున్నట్లు నటిస్తూ తన మనసులో మాటలు చెబుతూ ఉంటుంది. అప్పుడు రొమాంటిక్ గా మాట్లాడడంతో రాజ్ అలాగే చూస్తూ ఉంటాడు.