Brahmamudi November 18 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కావ్య ఒక పుస్తకాన్ని చదువుతూ కావాలనే రాజ్ కి మూడ్ తెప్పించేలా మాట్లాడుతూ ఉండగా రాజ్ ఏం చేయాలో తెలియక కావ్య పడుకున్న దుప్పటి నీ కిందికి లాగుతాడు. అప్పుడు కావ్య పడిపోతుండగా పట్టుకుంటాడు. అప్పుడు కావ్య వెళ్లి రాజ్ ఒడిలో పడుతుంది. కావ్య రాజ్ ఒడిలో పడుకొని ఆ రొమాంటిక్ కథని అలాగే కంటిన్యూ చేస్తూ చదువుతూ ఉంటుంది. అప్పుడు రాజ్ హే ఇంకా ఆపుతావా అంటూ కావ్య పై మండిపడతాడు. కావ్య మాత్రం రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు కావ్య చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకొని పైకి విసిరేయగా అది మళ్లీ వచ్చి రాజ్ తలపైనే పడుతుంది. దాంతో కావ్య నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్ ఇప్పటికీ ఎప్పటికీ మన మధ్య ఏ సంబంధం ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అరుణ్ పై సీరియస్ అయిన స్వప్న
మరొకవైపు స్వప్న అరుణ్ నైట్ ఫోన్ చేస్తానని మెసేజ్ పెట్టాడు కానీ ఇంకా కాల్ చేయడం లేదేంటి. అయినా నాకు ఏంటి ఈ టెన్షన్ నేను తప్పు చేసినప్పుడు కూడా ఇంతలా భయపడలేదే అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అరుణ్ రాజ్ ఇంటి దగ్గరికి వచ్చి గేటు దగ్గర నిలబడి రాహుల్ కి ఫోన్ చేస్తాడు. నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్ అనడంతో సరే అని అంటాడు అరుణ్. అప్పుడు అరుణ్ స్వప్న కి ఫోన్ చేయడంతో అరుణ్ పై సీరియస్ అవుతుంది. నీకు అసలు బుద్ధుందా నీ ఫొటోస్ ఎందుకు పంపించావు. నీకు మైండ్ పని చేస్తుందా అని సీరియస్ అవుతుంది. బండ బూతులు తిట్టడంతో అప్పుడు అరుణ్ కేవలం నా ఫోటో మాత్రమే పంపించలేదు మనిద్దరం కలిసి దిగిన ఫోటోలు పంపించాను అనడంతో స్వప్న షాక్ అవుతుంది.
అరుణ్ చెంప చెల్లుమనిపించిన స్వప్న
అప్పుడు అరుణ్ ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను ఇప్పుడు నేను మీ ఇంటి ముందు ఉన్నాను అనడంతో స్వప్న షాక్ అవుతుంది. నేను రాను ఇది నా అత్తారిల్లు నా కాపురం నాశనం అవుతుంది అన్నడంతో జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా వచ్చి వెళ్ళిపో స్వప్న అని అనడంతో స్వప్న చేసేదేమీ లేక మాట్లాడడానికి బయటకు వెళుతుంది. అప్పుడు స్వప్న బయటకు వెళ్తుండగా రాహుల్ ,రుద్రాణి ఇద్దరూ అది చూసి సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు రుద్రాణి ఇదే మంచి సమయము రాజ్ ని బెడ్ రూమ్ లో నుంచి బయటికి తీసుకువచ్చి వారిద్దరిని చూసేలా చెయ్ అనడంతో సరే మామ్ అని అంటాడు రాహుల్. తర్వాత స్వప్న కోపంతో బయటకు వెళ్లి అరుణ్ ని చేయి పట్టుకుని బయటకు పిలుచుకుని వెళ్తుంది. అప్పుడు స్వప్న అరుణ్ చంప చెల్లుమనిపించడంతో రాహుల్ షాక్ అవుతాడు.
రాజ్ ముందు దొంగ కన్నీరు కారుస్తున్న రాహుల్
ఇది నిజంగానే ఫైర్ బ్రాండ్. డబ్బు లేకపోయినా క్యారెక్టర్ ఉంది అనుకోని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ఏంట్రా పిచ్చిపిచ్చిగా ఉందా ఇంట్లోకి వస్తానని బ్లాక్ మెయిల్ చేస్తావా అని సీరియస్ అవుతుంది స్వప్న. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా రాహుల్, రాజ్ కి ఫోన్ చేసి బాల్కనీలోకి రమ్మని చెబుతాడు. ఎందుకొచ్చావు చెప్పు అనగా అప్పుడు అరుణ్ ఐ లవ్ యు అని చెప్పగా స్వప్న షాక్ అవుతుంది. ఇంతలో రాజ్ రావడం గమనించిన రాహుల్ దొంగ కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. అప్పుడు స్వప్న ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. నాకు పెళ్లయింది ఈ విషయం చెప్పడానికి ఇంత రాత్రిపూట వచ్చావా అని అరుణ్ పై సీరియస్ అవుతుండగా కావ్య అది చూసి షాక్ అవుతుంది. తర్వాత రాజ్,రాహుల్ దగ్గరికి వస్తాడు. తర్వాత స్వప్న ఏంట్రా నువ్వు పెళ్లి కాకముందే రిజెక్ట్ చేశాను అలాంటిది ఇప్పుడు ఎలా ఓకే చేస్తానని అనుకుంటున్నావు.
స్వప్న గురించి ఆలోచనలో పడ్డ రాజ్
అప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదని ఇప్పుడు నా కాపరాన్ని చెడగొట్టేకి వచ్చావా అనడంతో అరుణ్ ఏమీ తెలియనట్టుగా స్వప్న నిజంగానే ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతూ ఉంటాడు. మరోవైపు రాహుల్ దొంగ కన్నీరు కారుస్తూ అసలు విషయం చెప్పకుండా రాజ్ ముందు నటిస్తూ ఉంటాడు. అప్పుడు ముందు ఏం జరిగిందో చెప్పు రాహుల్ అని అనగా ఏం మాట్లాడకుండా రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు స్వప్న చెయ్యి పట్టుకొని అరుణ్ బ్రతిమలాడుతూ ఉండగా అది చూసి కావ్య షాక్ అవుతుంది. అప్పుడు రాజ్ స్వప్న ఏంటి ఈ టైంలో ఎవరో అబ్బాయితో మాట్లాడుతోంది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత అరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో స్వప్న లోపలికి వెళ్తుండగా కావ్య స్వప్న చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కెలుతుంది.
Brahmamudi November 18 Today Episode: స్వప్నపై సీరియస్ అయిన కావ్య
ఏంటి అక్క ఇది ఏం చేస్తున్నావు? ఒక దాని తర్వాత ఒకటి చెప్పు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం మీకు సరదా అయ్యిందా అని అడుగుతుంది కావ్య. ఏం చేస్తున్నావు అరుణ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనడంతో మాట్లాడడానికి వచ్చాడు అనగా నీకు ఏమైనా పిచ్చా ఈ టైంలో అతనితో నీకేం మాటలు ఉంటాయి అని అంటుంది కావ్య. అప్పుడు స్వప్న అసలు విషయం చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. అయినా ఎన్ని రోజులు మౌనంగా ఉన్న అతను ఇప్పుడు ఎందుకు వచ్చి నిన్ను ఇలా అడుగుతున్నాడు ఆ విషయం అడగొచ్చు కదా అనడంతో నేను మీ అక్కను నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనడంతో ఇంట్లో వాళ్లపై మాత్రం బాగా అరుస్తావు బయట వారిపై మాత్రం నోరు ఎత్తలేవు అని సీరియస్ అవుతుంది కావ్య. మరోవైపు కనకం ఒకచోట కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉండగా ఇంతలో కృష్ణమూర్తి అక్కడికి వస్తాడు. తెల్లవారుజామున రెండు అవుతోంది ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు కృష్ణమూర్తి. సరే ఇప్పటికే లేట్ అయింది వెళ్లి పడుకుందాం పదా అనడంతో మీతో ఒక విషయం మాట్లాడాలి. మనకు మళ్ళీ ఇంకొక సమస్య వచ్చి పడింది అనడంతో కృష్ణమూర్తి షాక్ అవుతాడు.