Brahmamudi November 20 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కనకం ఎమోషనల్ అవుతూ మీకు ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పకపోతే నేను మీ దృష్టిలో మళ్ళీ ఇంకొక తప్పు చేసిన దాన్ని అవుతాను అనగా ఏమైంది కనకం ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనడంతో మళ్లీ మనకు సమస్య మొదలయ్యింది అనడంతో కృష్ణమూర్తి టెన్షన్ పడుతూ ఉంటాడు. సమస్య ఎవరికి నీకా నాకా పిల్లలకు అనడంతో మనకే అని జరిగిన విషయం చెప్పడంతో కృష్ణమూర్తి షాక్ అవుతాడు. కనకం మాటలకు కృష్ణమూర్తి కూడా ఎమోషనల్ అవుతాడు. సరే ఇప్పుడే వెళ్లి నేను అప్పు తో మాట్లాడుతాను అని కృష్ణమూర్తి వెళ్లబోతుండగా కనకం అడ్డుపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుని కనకం దంపతులు ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అదృష్టవశాత్తు కళ్యాణ బాబు ఆ అనామికను ప్రేమించాడు కాబట్టి సరిపోయింది లేదంటే అప్పు ఆశలు పెట్టించుకుంటే పరిస్థితి చేయి దాటి పోయేది అని అంటాడు.
రాజ్ కి అసలు విషయం చెప్పిన చిట్టి
ఇప్పటికే ఇద్దరు కూతుర్లను ఆ ఇంటికి పంపించినందుకు మనల్ని అనకూడని మాటలు అని అంటున్నారు. మళ్లీ ఇప్పుడు అప్పును కూడా ఆ ఇంటికి పంపితే మనల్ని పురుగులను చూసినట్టు చూస్తారు అని ఎమోషనల్ అవుతూ మాట్లాడతాడు కృష్ణమూర్తి. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్తుండగా చిట్టి అడ్డుపడి ఒక నిమిషం రాజ్ నీతో ఒక అర్జెంటు విషయం మాట్లాడాలి అని అంటుంది. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు రాజ్ అనగా ఏమైందో చెప్పు నానమ్మ అని అంటాడు రాజ్. అప్పుడు చిట్టి ఒక వ్యక్తి ఫోటో చూపించడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇతను అనడంతో ఎవరో నాకు కూడా తెలియదు ఇంటికి కొరియర్ వచ్చింది అందులో ఇతని ఫోటో అలాగే స్వప్న ఇతను కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి అనడంతో రాజు షాక్ అవుతాడు. ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలిస్తే తప్పుగా అపార్థం చేసుకుంటారని ఫోటోలు చింపేశాను స్వప్నని అడిగితే నాకు తెలియదని చెప్పింది అనడంతో ఆశ్చర్యపోతాడు.
కావ్యని నిలదీసిన రాజ్
మీ అత్తయ్య గురించి తెలిసిందే కదా మళ్లీ గొడవలు సృష్టిస్తుంది అందుకే నేను ఈ విషయం మీతో చెప్తున్నాను ఈ ఫోటో తీసుకో అతను ఎవరు ఎంక్వయిరీ చేయి అని చెబుతుంది చిట్టి. అప్పుడు రాజ్ సరే నానమ్మ అని ఆ ఫోటో తీసుకొని కావ్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రాజ్ అసలు విషయం చెప్పబోతుండగా కావ్య తిక్క తిక్కగా మాట్లాడడంతో రాజు సీరియస్ అవుతాడు. అప్పుడు కావ్య మీ చిరాకైనా ఫేస్ చూడడం కంటే ఆ అసలు విషయం ఏంటో చెప్పండి వింటాను అని అంటుంది కావ్య. అప్పుడు అరుణ్ ఫోటో చూపించడంతో కావ్య ఒకసారిగా షాక్ అవుతుంది. అప్పుడు అతను నీకు తెలుసా అనడంతో అతను పేరు అరుణ్,అతను మా అక్క క్లాస్మేట్ అతని డాక్టర్ చదివాడని తెలుసు అనడంతో రాజ్ సరే అని అంటాడు. అప్పుడు నేను మీకు నిజం చెప్పాను కదా ఎందుకు అడుగుతున్నారు అనడంతో నేను చెప్పను అని రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కళ్యాణ్ పై సీరియస్ అయినా కృష్ణమూర్తి
అప్పుడు కావ్య ఆలోచనలో పడుతుంది. తర్వాత రాజ్ బయటికి వెళ్తూ కావ్య చెప్పిన మాటలు పట్టించుకోకూడదు. నా స్టైల్ లో నేను ఎంక్వయిరీ చేయాలి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తరువాత కళ్యాణ్ అప్పు వాళ్ల ఇంటికి వెళ్లి ఏంటి బ్రో రెడీ అవమని చెప్పి మెసేజ్ పెట్టాను కదా ఇంకా అలాగే ఉన్నావ్ ఏంటి అని అడగడంతో పొద్దున్నే లేచి చిన్నప్పటినుంచి సెల్లు చేతిలో పట్టుకొని తిరగడానికి నేనే బిజినెస్ చేయలేదు అని అప్పు చిరాకు పడుతుంది. అప్పుడు నా గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అనడంతో ప్రతిరోజు నువ్వు లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏమేం చేస్తావో ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు అనడంతో ఆ మాటలు విన్న అప్పు వాళ్ళ ఫ్యామిలీ షాక్ అవుతారు. అప్పుడు నువ్వు వెల్లు బ్రో పెళ్లి పనులు చాలా ఉన్నాయి ఇప్పటికే లేట్ అయింది అనడంతో వెంటనే కృష్ణమూర్తి అప్పు నీతో రావడానికి కుదరదు అని అంటాడు.
Brahmamudi November 20 Today Episode: కళ్యాణ్ మాటలకు బాధపడుతున్న అప్పు
అప్పుడు కళ్యాణ్ ఏంటి అంకుల్ ఎలా మాట్లాడుతున్నారు అనడంతో కనకం అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది. ఏంటి బ్రో నువ్వు కాలేజీకి వెళ్లకుండా అనడంతో మీతో తిరగడానికే అప్పు కాలేజీ మానేసింది అని అంటాడు కృష్ణమూర్తి. అవును కరెక్టే బ్రో ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్ళు రేపు మర్నాడు కాలేజీ లేదు కాబట్టి మనం పెళ్లి పనులు చూసుకుందాం అని అంటాడు కళ్యాణ్. అప్పుడు కళ్యాణ్ మాటలకు ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా తలదించుకుంటారు. అప్పుడు కనకం సరే బాబు తీసుకెళ్ళు అనడంతో కృష్ణమూర్తి కోపంగా చూస్తూ ఉంటాడు. తరువాత స్వప్న కాఫీ తాగుతుండగా కావ్య వెళ్లి గెట్టిగా అరవడంతో ఎందుకు అలా అరుస్తున్నావు అనగా మా ఆయన నిన్ను అనుమానిస్తున్నాడు అని అనిపించింది కావ్య.
స్వప్నని నిలదీసిన కావ్య
నువ్వు అబద్ధం చెప్పావు అరుణ్ కేవలం నీతో మాట్లాడడానికి మాత్రమే వచ్చాడు అని చెప్పావు అనడంతో ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను అనగా అయితే మరి మా ఆయన దగ్గరికి ఆ అరుణ్ ఫోటో ఎందుకు వచ్చింది అనడంతో స్వప్న షాక్ అవుతుంది. రాత్రి నువ్వు అతని కలిశావు ఇప్పుడు మా ఆయన ఫోటో చూపించి నన్ను ఎంక్వయిరీ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది నువ్వు నా దగ్గర ఎందుకు దాస్తున్నావు అని నిలదీస్తుంది కావ్య. ఈ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అయినా నేను తప్పు చేసినప్పుడే భయపడలేదు ఇప్పుడు ఎందుకు భయపడతాను అని గట్టిగా మాట్లాడి వెళ్లిపోవడంతో కావ్య అక్క ఇంత గట్టిగా మాట్లాడుతుంది అంటే తన తప్పు చేయలేదు కానీ ఆయన ఎందుకు అరుణ్ గురించి అడిగారు అని ఆలోచనలో పడుతుంది. అదంతా చూసిన రాహుల్ ప్లాన్ ని మరింత రసవత్తరంగా చేయాలి అనుకుంటూ అరుణ్ కి ఫోన్ చేస్తాడు. అప్పుడు రాహుల్ నేను చెప్పిన విధంగా స్వప్నకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చెయ్ అని అంటాడు. మరోవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తూ జరిగిన విషయాల గురించి తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు పోలీస్ కి ఫోన్ చేసి అరుణ్ గురించి ఎంక్వయిరీ చేయమని చెబుతాడు.