Brahmamudi November 23 Today Episode: నగల గురించి ఆలోచిస్తూ తొందరలో పండుగలు కూడా ఏమీ లేవు. అయినా ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఆ నగల గురించి అడిగితే ఇదివరకు రాహుల్ నగలు తీసుకున్నాడు కాబట్టి ఆ తప్పంతా రాహుల్ మీదకు నెట్టేస్తాం అనడంతో ఆ మాటలు విన్న రాహుల్ షాక్ అవుతాడు. నిన్ను ఇంట్లో నుంచి గెంటేయడమంలో తప్పులేదు అవసరం వస్తే భర్తను కూడా ఇరికిస్తావా అని అనుకుంటూ ఉంటాడు రాహుల్. ఆ తర్వాత స్వప్న నగలు అన్ని బ్యాగులు సర్దుకొని దొంగగా బయటకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరొకవైపు రాజ్ కావ్య ఇద్దరూ దొంగ కట్టేసిన కట్ల తోనే అలాగే పడుకొని నిద్రపోతూ ఉంటారు. అప్పుడు దాన్యలక్ష్మి రాజు కావ్యలను నిద్ర లేపడానికి గదిలోకి వెళుతుంది.

రాజ్ ని అడ్డంగా ఇరికించిన కావ్య

అప్పుడు తలుపు తడుతుండగా రాజ్ కావ్య ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. తలుపు తెరిచి చూడగా కర్మ ఎప్పుడు వచ్చినా కూడా రాకూడని సమయాల్లోనే వస్తాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్ అసలు విషయం చెప్పబోతుండగా కావ్య అడ్డుపడి రాజ్ ని ధాన్యలక్ష్మి ముందు అడ్డంగా ఇరికిస్తుంది. అపార్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రాజ్ కావ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఎందుకు అలా చెప్పావు అనగా అలా చెప్పకపోతే ఇంట్లో వాళ్ళందరూ నువ్వు దొంగను కూడా పట్టుకోలేకపోయావని మీ వైపు చూస్తారు సరే సరేలే అని కవర్ చేసుకుంటాడు రాజ్. మరొకవైపు స్వప్న నగలు తీసుకొని వెళుతుండగా రుద్రాణి అలాగే చూస్తూ ఉంటుంది. రుద్రాణి అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నావు అనడంతో బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు అత్తయ్య అనగా నువ్వు అత్తగారింట్లో ఉన్నప్పుడు ఒకరికి చెప్పి వెళ్లాలని తెలియదా అని అంటుంది రుద్రాణి.

రుద్రానికి అబద్ధాలు చెప్పిన స్వప్న

బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నాను అనడంతో నువ్వు ఎందుకు వెళ్లడం వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తాను అని అంటుంది రుద్రాణి. అప్పుడు మా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాను తనయితే హెడ్ మసాజ్ బాగా చేస్తుందని అబద్ధాలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చూసావా మామ్ తను ఎలా అబద్ధాలు చెబుతుందో అని రాహుల్ అనడంతో తాను ఎలా చెబితే మనకెందుకు అరుణ్ గాడికి ఫోన్ చేసి డబ్బులు ఇస్తున్నప్పుడు ఫొటోస్ తీసుకోమని చెప్పు సరే అని అంటాడు రాహుల్. ఆ తర్వాత అప్పు భోజనం వద్దు అనగా కృష్ణమూర్తి పిలిచి ప్రేమగా కూతురికి వడ్డిస్తూ మంచి మాటలు చెబుతూ ఉంటాడు. మంచి మాటలు చెబుతూనే అప్పుకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. అది చూసి కనకం ఎమోషనల్ అవుతుంది.

అప్పుని ఓదారుస్తున్న కృష్ణమూర్తి

బాధని దిగమిందుకో నిజం తెలుసుకో నువ్వు బాధపడుతూ ఒంట్లో వాళ్ళని బాధ పెట్టకు అని అంటాడు కృష్ణమూర్తి. అప్పుడు అప్పు ఏం మాట్లాడాలో తెలియక టిఫిన్ కూడా తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు రాజ్ ఆకలితో అలమటిస్తూ ఉండగా కావ్య కామెడీ చేస్తూ ఏదో ఒకటి అన్నారు కదా అని ఏదో ఒకటి అని అక్షరాలు దోశ పెడితే రాసుకొని ప్లేట్ లోకి తీసుకొని వస్తుంది. అప్పుడు రాజ్ కోపంతో రగిలిపోతూ ఉండగా కావాలనే కావ్య కామెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు కిందన ఉప్మా చేశాను పదండి అనడంతో సరే వెళ్దాం పద ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను అని అంటాడు రాజ్. మరోవైపు స్వప్న అరుణ్ ని కలవడానికి వెళుతుంది. అప్పుడు అరుణ్ ఏంటి డార్లింగ్ అనగా మర్యాదగా మాట్లాడు అని అంటుంది స్వప్న. సరే డబ్బు తెచ్చావా అనడంతో తెచ్చాను అని అంటుంది స్వప్న.

Brahmamudi November 23 Today Episode: అరుణ్ కి డబ్బులు ఇచ్చిన స్వప్న

ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు మళ్లీ బ్లాక్ మెయిల్ చేయమన్న నమ్మకం ఏంటి అనడంతో నువ్వు నన్ను నమ్మాలి అంతకుమించి నీకు వేరే మార్గం లేదు అని అంటాడు. అప్పుడు అరుణ్ స్వప్న కి మాయ మాటలు చెప్పిన నమ్మిస్తూ ఉంటాడు. స్వప్న రాహుల్ చేతిలో డబ్బులు పెట్టి నాకు సమస్యలు రానంత వరకు నువ్వు ఎన్ని చెప్పినా వింటాను ఒకవేళ నా కాపురానికి మచ్చ వచ్చే సందర్భమే వస్తే కనుక నేను ఎవరిని లెక్క చేయను అనడంతో అరుణ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మరొకవైపు రాహుల్,రుద్రాణి ఇద్దరు స్వప్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అరుణ్ గాడు నిజం చెప్పేస్తాడేమో అని రుద్రాణి టెన్షన్ పడుతూ ఉండగా అలాంటిదేమీ జరగదు ధైర్యంగా ఉండు మామ్ అని అంటాడు రాహుల్. అప్పుడు అరుణ్ ఫోటోలు పెట్టడంతో రుద్రాణి సంతోష పడుతూ ఉంటుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 23, 2023 at 7:44 ఉద.