Brahmamudi November 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రాహుల్ స్వప్న రాక కోసం ఎదురుచూస్తుండగా స్వప్న రావడం చూసి రుద్రాణి మొదలు పెట్టమంటూ సైగలు చేస్తుంది. అప్పుడు ఆగు ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని అనడంతో రాహుల్ గొంతు ఉన్న అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడు రుద్రాణి ఏమీ తెలియనట్టుగా అదేంటి రాహుల్ అలా అడుగుతున్నావు స్వప్న పార్లర్ కి వెళ్తుంది అని నాకు చెప్పి వెళ్ళింది అందంతో పార్లర్క కి వెళ్తే ఇంతసేపు అక్కడే గడిపి వచ్చిందా అనగా స్వప్న షాక్ అవుతుంది. అప్పుడు కావ్య మర్యాదగా మాట్లాడు రాహుల్ అనగా ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం కావ్య నువ్వు తలదూర్చకు అని అంటాడు. అయినా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు రాహుల్ అని రుద్రాణి ఏమి తెలియనట్టుగా అడగడంతో ఇది నాతో కాకుండా ఇంకా ఎవరితోనో తిరుగుతోంది అనడంతో చెంప పగలగొడతాను అని అంటుంది చిట్టి.

సరికొత్త నాటకం మొదలుపెట్టిన రుద్రాణి

భార్య బయటికి వెళ్లి కాస్త ఆలస్యంగా వస్తే ఇలాంటి మాటలు మాట్లాడతారా అని అంటుంది అపర్ణ. అప్పుడు మా అక్క అలాంటిది కాదు అని అంటుంది కావ్య. సరే మీ అక్క అలాంటిది కాకపోతే మరి ఎందుకు మౌనంగా ఉంది అని లాజిక్ ప్రశ్న వేస్తుంది రుద్రాణి. అప్పుడు సరికొత్త నాటకం మొదలు పెడుతూ ఇంట్లో అందరూ నాకు సపోర్ట్ గా మాట్లాడుతుండడంతో ఎందుకు మాట్లాడాలి అని మౌనంగా ఉన్నాను అని అంటుంది స్వప్న. అప్పుడు రాహుల్ నువ్వు నిజం చెప్తావా నన్ను నిజం చెప్పమంటావా నువ్వు ఎక్కడికి వెళ్లావో నువ్వు చెబుతావా లేదా నన్ను చెప్పమంటావా అనడంతో అందరూ రాహుల్ మాటలకు ఆశ్చర్యపోతారు. స్వప్న అప్పుడు టెన్షన్ పడుతూ ఉంటుంది.

అసలు విషయం తెలిసి షాకైన రాజ్ ఫ్యామిలీ

అంత పెద్ద మాట ఎందుకు అన్నావు స్వప్న అంత పెద్ద తప్పు ఏం చేసింది అని ఇంట్లో అందరూ నిలదీయడంతో రాహుల్ స్వప్న ఇద్దరు కలిసి దిగిన ఫోటోని ఇంట్లో అందరికీ ఒక్కొక్క ఫోటో ఇవ్వడంతో ఆ ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతారు. చూశారా అందరూ కల్లారా చూసారా అనడంతో వాడు నా కాలేజ్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే అవి కాలేజీలో దిగిన ఫొటోస్ అని అంటుంది స్వప్న. ఫ్రెండ్ అయితే నేను వాడి ఫోటో నీకు చూపించి అడిగితే తెలియదు అని ఎందుకు అబద్ధం చెప్పావు అనడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అవును అమ్మమ్మ నీ దగ్గర నేను నిజం దాచాను దానికి కారణం ఉంది ఇంతకుముందే నా కడుపు విషయంలో పెద్ద గొడవ జరిగింది ఇది కూడా మరింత గొడవ పెద్దదవుతుంది అని నేను మీ దగ్గర అబద్ధం చెప్పాను అని అంటుంది స్వప్న. అప్పుడు మధ్యలో కావ్య కలగజేసుకొని అరుణ్ మంచి వ్యక్తి మాకు మంచి స్నేహితుడు వీళ్లిద్దరి పరిచయం నాకు కూడా తెలుసు అని అంటుంది కావ్య.

రాజ్ మాటలకు షాక్ అయిన కావ్య

అప్పుడు రాహుల్ అంటే మీ అక్క ఇప్పటికే వాన్ని కలవడం లేదా అనడంతో రుద్రాణి ఏమీ తెలియనట్టుగా నాటకాలు ఆడుతూ ఉంటుంది. వాడిని ఇంటి దగ్గరికి పిలిపించుకొని మాట్లాడావు కదా అనడంతో అవును నేను కూడా నా కల్లారా చూసాను అని అంటాడు రాజ్. ఇప్పుడు రుద్రాణి సరికొత్త నాటకం మొదలు పెడుతూ ఎవడు వాడు, వాడికి నీకు సంబంధం ఏంటి నీకు ఫ్రెండ్ అయితే ఇంట్లోకి వచ్చి పబ్లిక్ గా కలిసి వెళ్లాలి కానీ దొంగచాటుగా కలవాల్సిన అవసరం ఏముంది అనడంతో స్వప్న ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను కలిశాను నిజమే అనడంతో ఏం మాట్లాడావు అని అడుగుతుంది రుద్రాణి. అంటే సంస్కారం లేని వాళ్ళము ఒక అబ్బాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే దిగజారిపోయి మాట్లాడుతున్నామని అనుకుంటున్నావా అనడంతో అవును అని అంటుంది స్వప్న. అయితే మరి నువ్వు వాడికి డబ్బులు ఎందుకు ఇచ్చి వస్తున్నావు అనడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

స్వప్నని అసహ్యించుకుంటున్న అపర్ణ

అప్పుడు కావ్య అడ్డుపడడంతో రుద్రాణి కావ్య నోరు మూయిస్తుంది. కావ్యని అనడం కాదు రాహుల్ దగ్గర ఆధారాలు ఉన్నాయా అనడంతో ఉన్నాయి అని అంటాడు రాహుల్. అప్పుడు ఆ ఫోటోలు అందరికీ చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని రుద్రాణి నిలదీస్తుంది. నగలు మొత్తం అన్ని తీసుకొని వెళ్లి తాకట్టు పెట్టి తీసుకోవచ్చింది అందుకు సంబంధించిన రిసెప్ట్ చూడండి అందరూ అని అంటాడు రాహుల్. ఆ మాటలకు అందరూ షాక్ అవుతారు. ఏం జరుగుతుంది స్వప్న నేను నిన్ను వెనకేసుకొచ్చినందుకు నువ్వు ఇలా చేసావ్ ఏంటి అసలు జరిగింది ఏంటో చెప్తావా చెప్పవా అని నిలదీస్తుంది చిట్టి. అప్పుడు అవకాశం దొరికింది కదా అని రుద్రాణి రెచ్చిపోతూ ఇలాంటి దాన్ని మళ్ళీ అడగడం ఎందుకు అమ్మ ఇంట్లోంచి గెంటేయాలి అని అంటుంది.

Brahmamudi November 24 Today Episode: స్వప్నని బయటకు గెంటేయాలనుకున్న రుద్రాణి

గతంలో నా కొడుకు తప్పు చేస్తే మీరందరు మందలిస్తే మాట కూడా అనలేదు అలాంటిది ఈ మాయలేదు ఇప్పుడు ఏం చేసిందో చూసారా ఇప్పుడేం చెప్తారు అని అందరిని నిలదీస్తుంది రుద్రాణి. ప్రతిసారి నేను నోరు మెదిపినప్పుడు అందరు నా మీద విరుచుకు పడతారు కదా ఇప్పుడు ఏమయింది అందరూ శిల్పాలు లాగా అలాగే నిలుచున్నారు అని అడుగుతుంది. అప్పుడు స్వప్న జరిగింది అంతా చెప్పడంతో ఇంత జరుగుతున్న మాకు ఎందుకు చెప్పలేదు అని నిలదీస్తుంది అపర్ణ. ఎందుకు చెప్పలేదు అంటే వాడికి తనకి రిలేషన్ నిజం కాబట్టి అని అంటాడు రాహుల్. అప్పుడు ఎవరు మాట్లాడకండి మీరు ఏం చేసినా మీరు ప్రశ్నించకండి ఈ ఆడదాన్ని నేను బయటకి వెంటేస్తాను అని అంటుంది రుద్రాణి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 24, 2023 at 7:54 ఉద.