Brahmamudi November 25 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రుద్రాణి అవకాశం దొరకడంతో అమ్మ, నాన్న, అన్న, వదిన ఈరోజు నాకు ఎవరు అడ్డు చెప్పకండి ప్రపంచంలో ఎవరు వచ్చి చెప్పినా కూడా నేను మాట వినను. ఇలాంటి ఆడదాన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు బయటికి పదవే అని స్వప్నను బయటకు గెంటేస్తూ ఉండగా అప్పుడు స్వప్న ఒకసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు కావ్య టెన్షన్తో అక్క ఏమైంది అక్క ఎందుకు ఇలా పడిపోయావు అని ఏడుస్తూ స్వప్న నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుండగా మరో సరికొత్త డ్రామా మొదలుపెట్టింది అని అంటారు రుద్రాణి రాహుల్. అప్పుడు స్వప్నను బయటకు ఈడ్చి పడేయాలి అని రాహుల్ వెళ్తుండగా రాజ్ అడ్డుపడతాడు. ప్రస్తుతం డాక్టర్ కి చూపించి తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అనడంతో చిట్టి కూడా రాజ్ కి సపోర్ట్ గా మాట్లాడుతుంది.

తల్లి కాబోతున్న స్వప్న

ఆ తర్వాత డాక్టర్ వచ్చి స్వప్నని చెక్ చేస్తూ ఉండగా మరొకవైపు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు డాక్టర్ బయటికి రావడంతో చిట్టి వెళ్లి ఏమైంది డాక్టర్ అని అడగగా భయపడాల్సింది ఏమీ లేదు తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అనడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అప్పుడు రాహుల్ రుద్రాణి ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసి షాక్ అవుతారు. అప్పుడు రుద్రాణి ఇప్పుడు మళ్లీ సరికొత్త నాటకం మొదలు పెట్టావా నువ్వు ఎంత డబ్బుకి అమ్ముడుపోయావు అని డాక్టర్ని ప్రశ్నించడంతో అందరూ అలాగే ఉండరు తన ప్రెగ్నెంట్ నమ్మితే నమ్మండి లేకుంటే లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రాహుల్ అందరి ముందు ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేను కాదు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. దీని బాయ్ ఫ్రెండ్ వల్లే తనకి ఈ కడుపు వచ్చింది.

రాహుల్ చెంప చెల్లుమనిపించిన స్వప్న

ఇలాంటి ఆడదాన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో పెట్టుకోకండి వెంటనే బయటికి పంపించేద్దాం అనడంతో ఏమన్నావు అంటూ భర్త చెంప చెల్లుమనిపిస్తుంది స్వప్న. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పటివరకు నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా మౌనంగా భరించాను. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నా బిడ్డకు తండ్రివి కాదు అని అన్నావు. నువ్వు నన్ను వదిలించుకోవడానికి ఇంత పెద్ద నింద వేస్తున్నావని ఇప్పుడే నాకు అర్థమైంది. మిస్టర్ రాహుల్ అని వేలు చూపిస్తూ నేను గొప్పగా బతకాలని ఆశపడ్డాను అది నిజమే కానీ ఈరోజు క్యారెక్టర్ ని చంపుకొని బతకాలని ఎప్పుడూ అనుకోలేదు అని అంటుంది స్వప్న. అలాంటి పెద్ద మాటలు మాట్లాడితే ఊరికే ఉంటానని ఎలా అనుకుంటున్నావు చంపేస్తాను అనడంతో రాహుల్ షాక్ అవుతాడు.

స్వప్న మాటలకు షాక్ అయిన రాజ్ ఫ్యామిలీ

నువ్వు ఇన్ని తప్పులు చేశాక వాడికి డబ్బులు ఇచ్చాక కూడా నిన్ను ఎవడు నమ్ముతాడు నమ్మి తీరాలి అని అంటుంది. నేను ఎప్పుడూ ధనవంతుల్లా జీవించాలని అనుకుంటాను తప్పితే నా క్యారెక్టర్ అది చంపుకొని బతకాలని ఎప్పుడు అనుకోను అని అంటుంది స్వప్న. అప్పుడు రుద్రాణి పతివ్రత మాదిరి మాట్లాడితే చేసిన తప్పు ఒప్పు అవుతుందా అని అంటుంది. ఎవరితోనో తిరుగుతూ నా కొడుకుని పిచ్చివాడిని చేసి ఇప్పుడు వాడి బిడ్డను మోస్తూ మిమ్మల్ని ఇంకా మోసం చేయాలని చూస్తున్నావా ఆడడంతో మొగుడిని వదిలేసిన నిన్నే పవిత్రంగా చూస్తోంది ఈ కుటుంబం అని అనడంతో రాహుల్ రుద్రాణి ఇద్దరూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. సాటి ఆడదానివి అయ్యి ఉండి మరో ఆడదాని మీకు నిందలు వేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని స్వప్న.

ఆవేశంతో ఊగిపోతున్న కావ్య

అప్పుడు కావ్య ఇక ఆపండి ఇప్పటివరకు మీరు ఎన్ని మాట్లాడినా సహించాను కానీ ఒక్క మాట మాట్లాడినా కూడా నేను మౌనంగా ఉండను అంటూ అందరి ముందు రాహుల్ రుద్రాణిపై సీరియస్ అవుతుంది. ఇంట్లో అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు ఎవరు నోరు మెదపంది అని కావ్య అనడంతో అందరూ కావ్య మాటలకు షాక్ అవుతారు. నువ్వు ఆగు కావ్య. ఈ విషయంలో నన్ను ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను నేను గెలిపించుకోవడానికి నాకు మన బలం చాలా ఉంది అని అంటుంది స్వప్న. ఇప్పుడు మీరు వేసిన ఆ నింద నేను చెరిపేసుకోవడానికి ప్రయత్నిస్తాను అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాను అని అంటుంది స్వప్న. డిఎన్ఏ టెస్ట్ చేయించి ఈ బిడ్డ మీ బిడ్డ అని రుజువు చేస్తాను అనడంతో అందరూ షాక్ అవుతారు. అందుకు నువ్వు సిద్దమేనా రాహుల్.

Brahmamudi November 25 Today Episode: రాహుల్ చెంప చెల్లుమనిపించిన రుద్రాణి

అప్పుడు మీరు వ్యక్తిత్వం గురించి మానవత్వం గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడండి అని అంటుంది. తప్పు నాది అని తెలిసి ఈ బిడ్డ నీ బిడ్డ కాదు అని తెలిస్తే నువ్వు గెంటాల్సిన అవసరం లేదు నేనే తలవంచుకొని ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను అని అంటుంది స్వప్న. నేను రెడీ నువ్వు రెడీనా అని అడుగుతుంది. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని ఇంట్లో అందరినీ వేడుకుంటున్నాను అని అంటుంది స్వప్న. ఒక ఆడపిల్ల తనపై నింద వేసిన కూడా అంత గట్టిగా నేను పరీక్షకు సిద్ధం అంటున్నా కూడా మీరు ఏం మాట్లాడటం లేదు దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి అని అంటాడు సీతారామయ్య. ఆ తర్వాత గదిలోకి వెళ్లడంతో రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది రుద్రాణి. ప్లాన్ ఫెయిల్ అయినందుకు కొడుకు పై సీరియస్ అవుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది రుద్రాణి. రాహుల్ రుద్రాణి, స్వప్నది ఫేక్ ప్రెగ్నెన్సీ అని నిరూపించడానికి మళ్లీ ప్లాన్లు వేస్తూ ఉంటారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 25, 2023 at 7:55 ఉద.