Brahmamudi November 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో జరిగిన విషయాల గురించి రాజ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కావ్య అక్కడికి రావడంతో చి చి మనసులు ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతున్నారో ఎవరి నమ్మాలో అర్థం కావడం లేదు అనడంతో మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అంటుంది కావ్య. అక్క గురించే అనడంతో అంటే మా అక్క తప్పు చేసింది అని మీరు కూడా నమ్ముతున్నారా అనగా తప్పు చేయలేదు అనడానికి తన ఒక్క నోరు తప్ప సాక్షదారాలు ఏమైనా ఉన్నాయా అని అంటాడు రాజ్. శీలానికి కూడా సాక్షాదారాలు ఉంటాయా మీరు కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అనడంతో తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఇలాగే మాట్లాడుతారు.

భర్తతో గొడవ పడుతున్న కావ్య

అక్క తప్పు చేయడం చెల్లెలు వెనకేసుకుని రావడం అనడంతో మీరు కూడా ఇలాగా మాట్లాడి నా దృష్టిలో దిగజారిపోకండి అనడంతో నువ్వు ఏమనుకున్నా సరే ఐ డోంట్ కేర్ అని అంటాడు రాజ్. ఆ మాటలకు కావ్య షాక్ అవుతోంది. మాటలు మర్యాదగా రానివ్వండి మర్యాదగా మాట్లాడండి. అయినా మా అక్క గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనడంతో ఇది దుగ్గిరాల వంశం అనగా మీకు మాత్రమే కాదు మాకు కూడా వంశం ఉంది. మాకు వ్యక్తిత్వం ఉంది అని అంటుంది కావ్య. మా కుటుంబానికి విలువలు తెలుసు కానీ మీకు ఏం తెలుసు అని మా అక్క శీలం గురించి మాట్లాడుతున్నారు. నీకు ఏం తెలుసు అని మా అక్క ప్రవర్తన గురించి కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అని భర్తతో గొడవ పడుతూ ఉంటుంది కావ్య.

రాజ్ తో చాలెంజ్ చేసిన కావ్య

మీ అక్క గురించి నాకు తెలియదా నాతో పెళ్లికి సిద్ధపడి పెళ్లి పీటల నుంచి రాహుల్ కోసం లేచిపోయింది అలాంటి దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని అంటాడు రాజ్. అప్పుడు స్వప్నని వెనకేసుకొస్తూ భర్తతో వాదిస్తూ ఉంటుంది కావ్య. నేను మూర్ఖంగా మాట్లాడుతుంటే మీ అక్కని కాదు నీ పాత తప్పుల్ని బయటపెట్టి నేను బయటికి గెంటేసే వాడిని అని అనడంతో కావ్య షాక్ అవుతుంది. ఒక ఆడదాన్ని బయటకు తింటే మీ దృష్టిలో పురుగు లాగా ఉందేమో అంటూ భర్త మీద సీరియస్ అవుతుంది కావ్య. నువ్వు ఎంత వాదించినా నన్ను నీ దృష్టిలో తక్కువగా చూసినా కూడా రాకుండా వేయడంలో తప్పు ఉంది అని నేను వాదిస్తాను అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య మీరు కూడా అందరిలాంటి మగవాళ్లే అని నిరూపించుకున్నారు.

స్వప్న పై సీరియస్ అవుతున్న రాహుల్

మీ అందరి కళ్ళు తెరిపిస్తాను నిజానిజాలు బయటకు తీస్తాను అంటూ భర్తతో ఛాలెంజ్ చేస్తుంది కావ్య. మరొకవైపు స్వప్న జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రాహుల్ అక్కడికి వచ్చి ఏంటే మహారాణిలా కూర్చున్నావు తప్పు చేసి ఇంకా మాట్లాడుతున్నావు అనడంతో నేనేం తప్పు చేశాను అని అంటుంది స్వప్న. అప్పుడు స్వప్న రాహుల్ జరిగిన విషయాల గురించి మళ్ళీ ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటారు. అంటే ఆ ఫోటోలన్ని
నిజం కాదా అనడంతో ఇచ్చాను కానీ అవన్నీ నిజం కాదు పరిస్థితులు వేరు అని అంటుంది స్వప్న. అప్పుడు ఇద్దరు వాదించుకుంటూ ఉండగా నువ్వు ఆ కళ్ళ ముందు ఒక క్షణం కూడా ఉండదు బయటికి వెళ్లి అనడంతో బాగా ఆలోచించుకొని చెప్పు మళ్ళీ నా నిర్ణయాన్ని మార్చుకోను అదంతా ఏంటి బెదిరిస్తున్నావా అని అంటాడు రాహుల్.

రాహుల్ ను బయటకు గెంటేసిన స్వప్న

అప్పుడు స్వప్న దిండు దుప్పటి బయటకు విసిరేసి రాహుల్ ని మెడ పట్టుకొని బయటికి గెంటేసి ముఖం మీద తలుపు రాహుల్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు అప్పు కృష్ణమూర్తి అన్న మాట తలుచుకునే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి కనకం వస్తుంది. ఇంట్లో నిన్ను ఎవరు అర్థం చేసుకోలేని బాధపడుతున్నావా అనగా లేదమ్మా నిజానికి అబద్ధానికి మధ్య తేడా తెలుసుకోలేకపోతున్నాను అని అంటుంది అప్పు. కన్నీళ్లు ఆగడం లేదు అని అప్పు అనగా ఒకసారి మీ నాన్న అన్న మాటల గురించి కూడా ఆలోచించు అప్పు అని అంటుంది కనకం. ఆలోచించడం లేదని ఎందుకు అనుకుంటున్నావు అమ్మ ప్రతిక్షణం ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నా కూడా నాతో రావడం లేదు అని బాధగా మాట్లాడుతూ ఎమోషనల్ అవుతుంది అప్పు.

వాడు నా మీద అంత ప్రేమ చూపించినప్పుడు నాకు కూడా ప్రేమ కలుగుతుంది కదమ్మా ఇవన్నీ ఎందుకు చేశాడమ్మా అని అనడంతో కనుక ఏం మాట్లాడకుండా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరి వాడు చూపించిన ప్రేమ నేను చూపించలేకపోయాను ఒకవేళ నేను చూపించిన వాడు చూడలేకపోయాడా అని ఎమోషనల్ అవుతుంది. అప్పుడు అప్పు తల్లి ఒడిలో ఒక తల పెట్టుకొని పడుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత రాజ్ నిద్ర లేచి చూడగా ఎదురుగా కావ్య ఉండటంతో అది చూసి ఉలిక్కిపడిన రాజ్ ఏంటి ఇది అనగా నాకు జ్ఞానోదయం అయ్యింది అంటుంది కావ్య. అప్పుడు కావ్య తిక్క తిక్కగా మాట్లాడడంతో రాత్రి జరిగింది మర్చిపోయావా అనడంతో లేదండి ఈరోజు నుంచి మా అక్క ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించడానికి నేను నిర్ణయించుకున్నాను.

Brahmamudi November 27 Today Episode: భర్త ఆశీర్వాదం తీసుకున్న కావ్య

అందుకే మీ పాదాలకు నమస్కారం చేసి ఆ పనికి శ్రీకారం చుట్టపోతున్నాను అని అంటుంది కావ్య. అప్పుడు రాజ్ పాదాలను గట్టిగా పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది కావ్య. ఆ తర్వాత అప్పు వాళ్ళ పెద్దమ్మ అప్పు టిఫిన్ తిందువు రావే అనడంత్తో కోపంతో బయటకు వచ్చిన ఇంత విషం పెట్టు మా అమ్మకి నాకు ఎటువంటి బాధ ఉండదు అని కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు చూసావా అక్క ఎలా మాట్లాడుతుందో అని కనకం కోప్పడుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 27, 2023 at 7:47 ఉద.