Brahmamudi November 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అప్పు వాళ్ళ పెద్దమ్మ దాన్ని అలా వదిలేయడంతో అంతేనంటావా ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా అనడంతో నోరు మూయవే. ఇది మీ మీ ఆయనకు తెలిస్తే నేను ఇంట్లోంచి గెంటేస్తాడు దీన్ని గుట్టు చప్పుడు కాకుండా ఉండనివ్వు అని అంటుంది. మనిద్దరి మధ్య ఉంటే ప్రాబ్లం లేదు అక్క అప్పు మనసు బాధ పడుతూ ఉంది అనడంతో ఎప్పుడైతే కళ్యాణ్ పెళ్లి ఆ అమ్మాయితో ఓకే అయిందో అప్పుడే అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడు అన్న విషయం తనకు తెలిసింది. అప్పటి నుంచి అది నీకు నాకు చెప్పుకోలేక ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది దానిని అలాగే వదిలేయ్ అది మర్చిపోతుంది అని అంటుంది అప్పు వాళ్ల పెద్దమ్మ. ఈ పెళ్లి జరగకూడదు ఇప్పటికే మనం మోస్తున్న నిందలు చాలు మీ పెద్ద కూతురు చిన్న కూతురు అక్కడ అనుభవిస్తున్నారు నరకం చాలు అని అంటుంది. అప్పు వాళ్ళ పెద్దమ్మ ఎంత చెప్పినా కూడా కనకం వినిపించుకోకుండా అప్పుకి కళ్యాణ్ కి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కనకం జరిగిన విషయాలు అన్నీ మర్చిపోయి మళ్ళీ మొదటికి వచ్చి అప్పుడు ఎలా అయినా కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటుంది.

కనకం కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణమూర్తి

ఆ మాటలు విన్న కృష్ణమూర్తి అక్కడికి వచ్చి కనకం అని గట్టిగా అరుస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ దీన్ని కూడా ఆ ఇంటికి కోడలిగా పంపుతావా. నువ్వు అసలు ఆడదానివేనా మళ్లీ అబద్ధాలు అన్ని ఆడాలని ప్రయత్నిస్తున్నావా అని కృష్ణమూర్తి సీరియస్ అవుతాడు. ఈ విషయం కనుక వాళ్లకు తెలిస్తే మనిద్దరి రానివ్వడం సంగతి పక్కన పెడితే అక్కడున్న ఇద్దరు కూతుర్లని కొట్టి తరిమేస్తారు అని అంటున్నాడు. అప్పుడు కనకం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కనకం నోరు మూయిస్తాడు కృష్ణమూర్తి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత స్వప్న ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఇంకా ఎన్నాళ్ళు ఇలా తప్పులు మీద తప్పులు చేస్తావు అనడంతో నేను చిరాకులో ఉన్నాను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపో అని అంటుంది స్వప్న. నీకు కాదు ప్రాబ్లం మాకు అనడంతో ఈ సమస్య నాది అనగా మీ సమస్య నా సమస్య కూడా అని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు అక్క అని అంటుంది కావ్య.

కావ్య మాటలకు ఆలోచనలో పడ్డ స్వప్న

అప్పుడు కావ్య స్వప్న కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తుండగా స్వప్న మాత్రం ఎప్పటిలాగే తింగరి తింగరిగా మాట్లాడుతూ ఉంటుంది. ఏ ఆడపిల్లకు అయినా తల్లి అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం ఆ విషయాన్ని అందరితో సంతోషంగా పంచుకోవాలని అనుకుంటుంది. కానీ నీ విషయం తెలియగానే అందరూ అయోమయంలో పడ్డారు. నాకు చెప్పకుండా ఏ విషయం చెయ్యొద్దు అని చెప్పాను కదా అనడంతో వాడు బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఇచ్చేశాను అని అంటుంది స్వప్న. కానీ ఇప్పుడు నువ్వు దోషిగా నిలబడ్డావు కదా అని అంటుంది. అప్పుడు కావ్య స్వప్న ఇద్దరూ అరుణ్ గురించి మాట్లాడుకుంటూ అరుణ్ ప్రవర్తన పై అనుమాన పడుతూ ఉంటారు. అరుణ్ ఇలా మారాడా లేకపోతే అరుణ్ వెనుక ఎవరైనా ఉన్నారా అనడంతో స్వప్న కూడా ఆలోచిస్తూ ఉంటుంది.

కావ్య మాటలకు టెన్షన్ పడుతున్న రుద్రాణి రాహుల్

అమ్మకు ఈ విషయం చెప్పావా అనడంతో నేనే సమయం చూసి చెబుతాను అని అంటుంది స్వప్న. ఆ తర్వాత కావ్య అరుణ్ గురించి ఆలోచిస్తూ వెళుతూ ఉంటుంది. అప్పుడు రుద్రాణి కొడుకుని మందలిస్తూ ఉండగా ఆ మాటలు విన్న కావ్య వాళ్ళ దగ్గరికి వెళుతుంది. ఏంటి రుద్రాణి గారు కొడుకుకి మా ఆయన్ని ఫాలో అవమని చెబుతున్నారా అనడంతో నేను ఎవరిని ఫాలో అవ్వను నా టాలంటే నాకు ఉంది అనడంతో అవును సొంత బ్రాంచ్ ఇస్తే ఇప్పుడు ఎంప్లాయ్ లా పని చేస్తున్నావు నీ టాలెంట్ ఏంటో అర్థం అవుతుంది అని అంటుంది కావ్య. నా కొడుకు సంగతి పక్కన పెట్టు మీ అక్క ఎవరితోనో కడుపు తెచ్చుకుంది అని దారుణంగా మాట్లాడుతుంది రుద్రాణి. అయినా మా అక్క అరుణ్ కి డబ్బులు ఇచ్చినట్లు మీకు ఎలా తెలిసింది ఆ ఫొటోస్ మీకు ఎవరు పంపించారు అనడంతో రుద్రానికి రాహుల్ టెన్షన్ పడుతూ ఉంటారు.

నిజం తెలుసుకునే ప్రయత్నంలో కావ్య

ఎవరు పంపించారో మాకు ఎలా తెలుస్తుంది అని రాహుల్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయగా మీరు ఎవరో తెలియకుండా నీకు ఫొటోస్ పంపిస్తారా అని అంటుంది కావ్య. అప్పుడు రాహుల్ ఆ ఫొటోస్ నాకు పంపిన వాడి ఫోన్ నెంబర్ నీకు పంపించాను వెళ్లి ఎంక్వయిరీ చేసుకో అని ఆ ఫోన్ నెంబర్ ని ఫార్వర్డ్ చేస్తాడు. ఈ కావ్య వెళ్లి ఆ అరుణ్ గాన్ని నిలదీసే లోపు నువ్వు వెళ్లి వాడిని కలువు అని సలహా ఇస్తుంది రుద్రాణి. అప్పుడు కావ్య వెళ్లి ఆ నెంబర్ చూడగా ఆ నెంబర్ అరుణ్ ది అయి ఉండడంతో అరుణ్ కావాలని రాహుల్ కి ఫొటోస్ పంపించాడు వాడిని పట్టుకుంటే మొత్తం నిజాలు బయటకు వస్తాయి అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు అనామిక, కళ్యాణ్ ఇద్దరు కలిసి షాపింగ్ కి వెళ్తూ ఉండగా కళ్యాణ్ అప్పును కూడా పిలుచుకొని వెళ్లాలి అని అంటాడు.

నాక్కూడా తెలుసులే నేను కూడా షాపింగ్ చేస్తాను అనడంతో వద్దు అప్పుకి అక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని అంటాడు కళ్యాణ్. అప్పుడు వాళ్లిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత కనకం ఏదో ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వాళ్ళ అక్క అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావే ఏ విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఒక తల్లిగా అప్పు కి ఏం న్యాయం చేయలేకపోతున్నాను అని బాధగా ఉంది అనడంతో ఒకసారి మీ ఆయన అన్న మాటలు గురించి కూడా ఆలోచించు అని అంటుంది అప్పు వాళ్ల పెద్దమ్మ. అది తన తలరాత అని తెలిసి వదిలేయాలి అని అంటుంది. ఇంతలోనే అప్పు కోసం కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పు ఎక్కడ ఆంటీ అనడంతో గదిలో ఉంది బయటకు రావడం లేదు కోప్పడుతోంది అన్నం సరిగా తినడం లేదు అని అంటుంది. అప్పుడు అప్పు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుండగా ఏంటి బ్రో ఇలా మారిపోయావు నువ్వు ఎందుకు ఇలా ఒంటరిగా ఉన్నావు అని అడుగుతాడు కళ్యాణ్.

Brahmamudi November 28 Today Episode: కళ్యాణ్ ని చూసి చిరాకు పడుతున్న అప్పు

అప్పుడు కళ్యాణ్ మాటలకు అప్పు విసుక్కుంటూ చిరాకు పడుతూ ఉంటుంది. నువ్వు అలా బాధపడుతుంది నేను చూస్తూ ఊరుకోలేను నీ ఫ్రెండ్ ని అని అంటాడు. ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటావు నేను అనామిక ఇద్దరం కలిసి వచ్చాము ముగ్గురం కలిసి షాపింగ్ కి వెళ్దాం పద అని అంటాడు. అప్పు ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు మర్యాదగా వెళ్ళిపో అని చిరాకు పడుతుంది అప్పు. అప్పుడు అప్పు మనసు మార్చి ప్రయత్నం చేస్తాడు కళ్యాణ్. మరోవైపు అనామిక వెయిట్ చేసే ఓపిక లేక కోపంగా ఇంట్లోకి వస్తుంది. మరోవైపు కళ్యాణ్ అప్పు గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తుకు వస్తావు అనడంతో చాలా బాగుంది కళ్యాణ్ అని అక్కడికి వస్తుంది అనామిక. నేను పిచ్చి దానిలా కారులో ఎదురు చూస్తుంటే నువ్వు ఇక్కడ ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నావా అనడంతో ఏంటి అనామిక అలా మాట్లాడుతున్నావు. నాకోసం అందరూ ఎదురు చూశారు నేను ఎవరి కోసం ఎదురు చూడలేదు అని కళ్యాణ్ ని అపార్థం చేసుకుని మాట్లాడుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 28, 2023 at 8:04 ఉద.