Brahmamudi November 29 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అనామిక నన్ను రోడ్ లో నుంచోపెట్టి నువ్వు నీ ఫ్రెండ్ తో కబుర్లు చెబుతున్నావా అనడంతో అదేంటి అనామిక అలా అంటున్నావు. పాపం అప్పు ఫీల్ అవుతోంది అనడంతో మీ ఫ్రెండ్ ఫీలింగ్స్ అర్ధం అవుతాయి నా ఫీలింగ్స్ నీకు అర్థం కావడం లేదా అనగా కార్లో కూర్చోమని చెప్పాను కదా అని కళ్యాణ్ అనడంతో నేనేమైనా పిచ్చిదాని అనుకున్నావా కార్లో వెయిట్ చేయడానికి, ఇప్పటివరకు అందరూ నాకోసం ఎదురు చూశారు కానీ నేను ఎవరి కోసం ఎదురు చూడలేదు. కానీ ఈరోజు నన్ను గంటసేపు వెయిట్ చేయించావు అనడంతో అది కాదు అనామిక చూడు అప్పు ఎలా ఫీల్ అవుతుందో అని అంటాడు కళ్యాణ్. అప్పుడు కళ్యాణ్ అప్పు ని రమ్మని బ్రతిమలాడుతూ ఉండగా అనామిక పదేపదే సీరియస్ అవుతూ ఉంటుంది.

అప్పు పట్ల మొండిగా ప్రవర్తిస్తున్న కళ్యాణ్

సరే నువ్వు నీ ఫ్రెండ్ తోనే ఉండు అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో నేను అనామికకు నచ్చదు అండి కానీ ఈ బ్రో బాధపడుతుంటే నేను చూడలేను అని అంటాడు కళ్యాణ్. అప్పుడు కళ్యాణ్ నువ్వు నిజం చెప్పి ఈరోజు నువ్వు నాతో నవ్వుతూ మాట్లాడే వరకు నేను ఇంట్లో నుంచి కదలను ముందుగా పట్టు పట్టుకొని కూర్చుంటాడు. తర్వాత రాజ్ రెడీ అవుతూ ఉండగా నేనే వచ్చి రెడీ అవ్వమని చూద్దామనుకున్నాను ఇంతలో మీరే రెడీ అయ్యారు అనడంతో రోజు నువ్వు చెప్తే నేను రెడీ అవుతానా అని అంటారు రాజ్. అప్పుడు ఇద్దరు ఫన్నీగా వాదించుకుంటూ ఉండగా ఈరోజు మన ఇద్దరం కలిసి ఒక చోటికి వెళ్తున్నాము అనడంతో నీతో కలిసి చచ్చిన రాను అని అంటాడు రాజ్. మా అక్కని ఏడిపించిన ఎక్కడ ఉన్నాడో తెలిసింది అనడంతో అయితే ఇప్పుడు ఏంటి అని అంటాడు రాజ్.

రాజ్ ని అడ్డంగా ఇరికించిన కావ్య

అయినా మీ అక్క కోసం అవన్నీ నువ్వు చేసుకో నేను ఎందుకు రావాలి అని అంటాడు రాజ్. నువ్వు ఎన్ని చెప్పినా నేను నీతో బయటికి రాను రాను అని తెగేసి చెబుతాడు రాజ్. అప్పుడు కావ్య రాజ్ తో చాలెంజ్ చేసి మీరు వచ్చేలా చేస్తాను అని కిందికి వెళుతుంది. అప్పుడు కనకం ఎక్కడికో వెళ్తున్నావు అనడంతో ఆయన చెప్పొద్దు అని చెప్పారు సర్ప్రైజ్ అంట అనడంతో అందరూ కావ్య వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఇంతలో రాజ్ అక్కడికి రావడంతో ఏంటి రాజ్ భార్యని అందంగా రెడీ చేసి ఎక్కడికో పిలుచుకొని వెళ్తున్నావు అనడంతో అడ్డంగా ఇరికించింది అని అనుకుంటూ ఉంటాడు రాజ్. అప్పుడు కావ్య అందరి ముందు రాజ్ ని అడ్డంగా ఇరికించడంతో రాజ్ ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అపుడు రాజ్ ఏం చేయాలో తెలియక సరే వెళ్దాం పద అనడంతో నేను రాను మీరు అత్తయ్య గారి పర్మిషన్ తీసుకుంటేనే నేను వస్తాను అని అంటుంది కావ్య.

Brahmamudi November 29 Today Episode: కొడుకుని చూసి కోపంతో రగిలిపోతున్న అపర్ణ

అప్పుడు అపర్ణ రాజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది ఇంతలా ఇరికిస్తుందని తెలిసి ఉంటే పైన ఒప్పుకునేవాడిని అనుకుంటూ ఉంటారు రాజ్. అప్పుడు సరే రాజ్ నీ భార్యని సంతోషంగా తీసుకెళ్ళు అని కోపంగా చెప్పడంతో అత్తయ్య సంతోషంగా చెప్పడం లేదు నేను రాను అని అంటుంది కావ్య. అప్పుడు కావ్య ఓవరాక్షన్ చేయడంతో అపర్ణ కోపంతో లోలోపల కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు అప్పు భోజనం చేస్తుండగా అది చూసి కనకం వాళ్ళ అక్క ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు కృష్ణమూర్తి ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా భర్త మాటలను పక్కనపెట్టి అప్పు కల్యాణను ఒకటి చేయాలని ప్లాన్లు చేస్తూ ఉంటుంది కనకం. అప్పుడు కనకం మాటలకు వాళ్ళ అక్క భయపడుతుండగా నువ్వేం భయపడకు అక్క నువ్వు ధైర్యంగా ఉండు అని అంటుంది కనకం.

స్వప్న పై సీరియస్ అయిన కనకం

తర్వాత స్వప్న ఫోన్ చేయడంతో ఏంటి అమ్మ ఈసారి ఏం పని చేశావు అని అంటుంది కనకం. అప్పుడు నేను తల్లిని కాబోతున్నాను అనడంతో ఆడిన నాటకమే మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు ఆడుతావు నీకు సిగ్గు లేదా అని స్వప్న మీద సీరియస్ అవుతుంది కనకం. నా మీద నమ్మకం లేకపోతే కావ్యకి ఫోన్ చేసి కనుక్కో అని అంటుంది స్వప్న. లేదంటే మా ఇంటికి వచ్చి తెలుసుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత రాజ్ కావ్య ఇద్దరు కారులో వెళుతుండగా కావ్య చిలిపి చిలిపి మాటలు మాట్లాడుతూ రాజ్ కి మరింత ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటుంది. అప్పుడు కావాలనే కావ్య రాజ్ ని ఇబ్బంది పెట్టేలా సతాయిస్తూ మాట్లాడుతుంది. అప్పుడు ఇద్దరూ ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు కనకం ఫోన్ చేసి మీ అక్క నిజంగానే తల్లి కాబోతోందా అని అడగడంతో రాజ్ తెగ నవ్వుకుంటూ ఉంటాడు. కావ్య రాజ్ వైపు కోపంగా చూస్తూ ఉండగా చూసావా మీ అమ్మనే నమ్మడం లేదు మేము ఎలా నమ్మాలి అని అంటాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 29, 2023 at 7:28 ఉద.