Brahmamudi November 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కనకం ఏంటి ఏం మాట్లాడవు అనడంతో అక్క నిజంగానే తల్లి అయిందమ్మ ఆడడంతో అని కావ్య అనగా నేను నమ్మను అది మళ్ళీ ఏదో ఒక నాటకం మొదలుపెట్టి ఉంటుంది అనడంతో పక్కనే ఉన్న రాజ్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. నిజం చెప్పవే అనడంతో నీ మీద ఒట్టు అమ్మ అక్క నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది కావ్య. మరొకవైపు రాజ్ ఫోన్ కట్ చేయడంతో కావ్య వైపు చూసి తెగ నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనం అరుణ్ గాడి దగ్గరికి వెళ్తున్నాము.. నిజం చెప్పే వరకు వాడిని మామూలుగా కొట్టకూడదు అని అంటుంది కావ్య. మరొకవైపు కనకం వాళ్ళ అక్కకు స్వప్న ప్రెగ్నెన్సీ గురించి చెప్పడంతో ఆమె సంతోష పడుతూ ఉంటుంది. ఇప్పుడు స్వప్న ప్రెగ్నెన్సీ అడ్డు పెట్టుకొని ఆ ఇంట్లో తిష్ట వేసి కళ్యాన్ అప్పులను ఒకటి చేస్తాను అని అనడంతో ఆమె టెన్షన్ పడుతూ ఉంటుంది.

అరుణ్ కి జాగ్రత్తలు చెబుతున్న రాహుల్

మరొకవైపు రాజ్ కావ్య ఇద్దరు కలిసి అరుణ్ హాస్పిటల్ కి వెళ్తారు. హాస్పిటల్లో అప్పటికే రాహుల్ వచ్చి అరుణ్ తో మాట్లాడుతూ ఉంటాడు. నాకోసం కావ్య రావడం ఏంటి సార్ అనడంతో వాళ్ళ అక్క మీద నిందలు వేస్తే నీకోసం వెతుక్కుంటూ రాదా అని రాహుల్ అనగా అరుణ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నీకు కావ్య గురించి తెలియదు సార్ తను చాలా మొండి అమ్మాయి ఎదురు పడితే నిజం చెప్పే వరకు నన్ను విడిచిపెట్టదు అని భయపడుతూ ఉంటాడు అరుణ్. అప్పుడు రాహుల్, అరుణ్ కి ధైర్యం చెబుతూ తన పేరు చెప్పకుండా చేయాలని చెబుతూ ఉండగా ఇంతలో కావ్య రాజు హాస్పిటల్ కి వచ్చి అరుణ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు రాజ్ నీ వేడి చూస్తుంటే వాడిని మర్డర్ చేసేలా ఉన్నావు లాయర్ కి ఫోన్ చేయమంటావా అని అంటాడు. జోక్ చెండాలంగా ఉంది అని కావ్య రాజ్ ఇద్దరు అరుణ్ క్యాబిన్ కి వెళ్ళగా అక్కడ ఉన్న సిస్టర్ అరుణ్ గారు నేను జాబ్ రిజైన్ చేసి వెళ్లారు అనటంతో కావ్య షాక్ అవుతుంది.

భర్తపై కోపడుతున్న కావ్య

అప్పుడు కావ్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మొత్తం ఇదంతా మీ వల్లే జరిగింది నేను అనుకున్న ప్లాన్ అంతా ఫెయిల్ అయింది అని రాజ్ మీద అరుస్తూ ఉంటుంది. అప్పుడు కావ్య అరుణ్ దొరకలేదు అన్న కోపం అంతా కూడా రాజ్ మీద అరుస్తూ ఉంటుంది. అరిచింది చాలు వెళ్దాం పద అని కావ్య, రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత చూసావా నేను చెప్పినట్టుగానే వాళ్ళు నేను వెతుక్కుంటూ వచ్చారు అని రాహుల్ అనడంతో కాసేపు ఉంటే దొరికిపోయే వాడిని సార్ అని అంటాడు. సరే నేను చెప్పే వరకు నువ్వు బయటికి రాకు లోపల ఎక్కడైనా ఒకచోటే ఉండు అని అరుణ్ కి ధైర్యం చెప్పి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు అనామిక కోపంతో రగిలిపోతుండగా ఇంతలో అక్కడికి కళ్యాణ్ వస్తాడు. అప్పుడు కళ్యాణ్ మీద అరుస్తూ ఫుల్ గా కోప్పడుతూ ఉంటుంది అనామిక.

పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తానన్న కళ్యాణ్

నువ్వు నీ ఫ్రెండ్ తో ఎలా అయినా ఉండు అది నీ ఇష్టం కానీ నువ్వు నా పక్కన ఉన్నప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను కూడా కోరుకుంటాను కదా అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ నచ్చచెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా అనామిక సీరియస్ అవుతూ మాట్లాడుతుంది. ఆ విషయం గురించి మరిచిపోయి మన పెళ్లి ఎప్పుడు అసలు నువ్వు ఆ విషయం గురించి ఏమీ ఆలోచించడం లేదు అనడంతో మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అవి కొంచెం సర్దుబాటు అయ్యాక మాట్లాడుతాను అని అంటాడు కళ్యాణ్. ఇప్పటికే నా పెళ్లి అని అందరికీ తెలిసిపోయింది ఎప్పుడు అని అడుగుతున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని అంటుంది అనామిక. ఇప్పుడే వెళ్లి మా వాళ్లతో మాట్లాడుతాను త్వరలోనే మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను అనడంతో కళ్యాణ్ ని హత్తుకుంటుంది.

స్వప్న పై సీరియస్ అయిన రుద్రాణి

మరొకవైపు సప్న చిటికెలు వేస్తూ పని మనుషులకు పని చెబుతూ మెనూని ఆర్డర్ పాస్ చేస్తూ ఉండగా ఇంతలో రుద్రాణి అక్కడికి వచ్చి పైకి లేవే అనడంతో లేవకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది స్వప్న. అప్పుడు రుద్రాణితో వాదిస్తూ ఎదురు సమాధానాలు చెబుతూ ఉంటుంది స్వప్న. ఇంతలోనే రాహుల్ అక్కడికి వస్తాడు. అప్పుడు స్వప్న అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తూ గొడవ మరింత పెద్దది చేస్తూ ఉండగా అమ్మమ్మ మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఆ కడుపు గురించి ప్రస్తావించి నాకు ఎందుకు చిరాకు తెప్పిస్తారు అని అంటాడు. తప్పు చేశాను అని అనడం కాదు సాక్షాలతో నువ్వు అయినా రుజువు చెయ్ లేదంటే నేనేనా రుజువు చేయాలి అంతేగాని పదేపదే ఆ మాట అంటే బాగుండదు అని అంటుంది స్వప్న. అప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు అన్న భయం లేకుండా అత్తకి మొగుడికి ఎదురు సమాధానం చెబుతూ నిందలు వేస్తూ ఉంటుంది స్వప్న.

ఎందుకమ్మా మీరేం మాట్లాడడం లేదు అని తల్లిదండ్రులను నిలదీస్తుంది రుద్రాణి. ఇది రోజు ఒక సినిమా చూపిస్తోంది ప్రతి నిమిషం ఏదో ఒక గొడవ క్రియేట్ చేస్తోంది అని అనిపిస్తుంది. రాహుల్ కూడా అవకాశం దొరికింది కదా అని స్వప్న మీద నిందలు వేస్తూ ఇలాంటి దాన్ని నేను భరించలేను ఇలాంటి దాంతో ఎలా కాపురం చేయాలి. మీ మాటలకు కట్టుబడి మౌనంగా ఉన్నాను అని అంటాడు. అప్పుడు చిట్టి సీతారామయ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అప్పుడు రాజ్ నువ్వు స్వప్నని బయటకు పంపించాలి అనుకుంటే దానికి తగిన సాక్ష్యాలు కావాలి అవి చూపించు ఆ తర్వాత చూద్దాం అని అంటాడు రాజ్. ఇలాంటి పొగరుబోతు ఆడదాన్ని ఇంట్లో పెట్టుకొని కాపురం చేసి బాధపడుతుంటే అది చూస్తూనే ఊరుకుంటేనే ఉండాలా అని అంటుంది రుద్రాణి.

Brahmamudi November 30 Today Episode: కావ్య మాటలకు తలదించుకున్న రాజ్ ఫ్యామిలీ

మెడపట్టి బయట గెంటేస్తాను అనడంతో సాక్షాలు చూపించండి అప్పుడు చూద్దాము అని అత్తతో ఛాలెంజ్ చేస్తుంది స్వప్న. అప్పుడు అపర్ణ స్వప్న బయటకు వెళ్తాను అంటుంది కదా మరి ఆ డిఎన్ఏ టెస్ట్ ఏంటో చేయించండి ఈ చిక్కుముడి విడిపోతుంది కదా అని అంటుంది. డాక్టర్లు ఇప్పుడే చేయడానికి వీలు కాదని చెప్పారు అని సుభాష్ చెప్పడంతో అంటే ఇంకా నెలరోజుల పాటు ఆగాలి అని అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు కావ్య అక్కని వెనకేసుకొస్తూ ఇంట్లో అందరూ నిలదీస్తూ ఉంటుంది. ఆ టెస్ట్ మా అక్క శీలానికి లేకపోతే కడుపుక అంటూ అందరినీ అవమానించే విధంగా మాట్లాడుతుంది కావ్య. అప్పుడు అందరూ కావ్య మాటలకు మౌనంగా తలదించుకుంటారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 30, 2023 at 7:45 ఉద.