Brahmamudi November Today 21 Episode: ఈరోజు ఎపిసోడ్ లో అరుణ్, స్వప్నకి వీడు నా చేతిలో అయిపోయాడు అని ఫోన్ లిప్ చేసి చెప్పాను కదా నాకు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త. అయినా నీకు నాకు ఏమి సంబంధం ఉంది కాల్ చేస్తున్నావు అనడంతో అక్రమ సంబంధం అని అరుణ్ అనడంతో స్వప్న షాక్ అవుతుంది. అప్పుడు స్వప్న అరుణ్ మీద సీరియస్ అవ్వడంతో జస్ట్ జోక్ చేశాను అని అంటాడు. నువ్వు అందగత్తెవని పెళ్లి అయిన తర్వాత కూడా నీ వెంట పడతానని అనుకున్నావా అనడంతో మళ్ళీ రాత్రి ఎందుకు వచ్చావు అనగా భయాన్ని పరిచయం చేయడం కోసం అనడంతో స్వప్న షాక్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది కాదు అనుకుండా నాకు ఇవ్వాలి ఏం కావాలి రా నీకు అనగా హాస్పిటల్ కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది నాకు 10 లక్షలు కావాలి అనడంతో స్వప్న షాక్ అవుతుంది.
స్వప్నని బ్లాక్ మెయిల్ చేస్తున్న అరుణ్
అంత డబ్బులు నా దగ్గర ఎలా ఉంటాయి ఆయన నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి. నేరుగా ఇంటికి వచ్చేయ్ నేను భయపడను అనడంతో మనిద్దరం కలిసి దిగినట్లు రూమ్ లో ఉన్నట్లు గ్రాఫిక్స్ ఫోటోలు పంపిస్తాను అనడంతో స్వప్న మళ్లీ షాక్ అవుతుంది. డబ్బులు ఇవ్వకపోతే నేను అన్నంత పని చేస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరోవైపు స్వప్న మాటలు విన్న రాహుల్ రుద్రాణి ఇద్దరు సంతోషంతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు దానికి నగలు తప్ప వేరే ఆలోచన రాదు ఆ నగలు అమ్మడానికి సిద్ధపడుతుంది అని అంటుంది రుద్రాణి. మరోవైపు స్వప్న కూడా నగలు తాకట్టు పెట్టడానికి కూడా లేదు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు కనకం వాళ్ళ ఇంటిదగ్గర ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయి దక్కలేదని సూసైడ్ చేసుకుంది అని తెలియడంతో అప్పు గురించి ఆలోచిస్తూ కనకం టెన్షన్ పడుతూ ఉంటుంది.
అరుణ్ గురించి తెలుసుకున్న రాజ్
అప్పుడు కనకం అప్పు దగ్గరికి వెళ్లి ఏదో ఒక పని చెబుతూ తనని ఆలోచించే అవకాశం లేకుండా చేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు రాజ్ కి పోలీస్ ఫోన్ చేసి అరుణ్ గురించి డీటెయిల్స్ అని చెబుతాడు. తర్వాత కావ్య అక్కడికి రావడంతో ఎప్పటిలాగే ఇద్దరు మళ్ళీ ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు. మరొకవైపు అప్పు జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ దిగులుగా కూర్చొని ఉండగా కనకం టెన్షన్ పడుతూ ఉంటుంది. దీనికి ఎలా అయినా పనులు చెప్పాలి లేదంటే అవే ఆలోచనలో ఉంటుంది అని కూరగాయలు కట్ చేయమని చెప్పగా అప్పు వాళ్ళ పెద్దమ్మ వచ్చి అడ్డుపడుతుంది. లేదక్కా దీనికి పని రావాలి కదా అని కనకం అప్పును కట్ చేయమని చెబుతుంది.
అప్పుని జాగ్రత్తగా చూసుకుంటున్న కనకం
అప్పుడు కనకం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ అప్పుని బట్టలు ఉతకమని చెబుతుంది. అప్పుడు అప్పు కూడా సరే అని అంటుంది. తరువాత ఏ పని చెప్పాలి అని కనకం ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కనకం వాళ్ళ అక్క వచ్చి ఎందుకు ఎప్పుడూ ఏ పని చెప్పని నువ్వు దానికి అన్ని పనులు చెబుతున్నావు అనడంతో అబద్ధాలు చెప్పి కవర్ చేసుకుంటుంది కనకం. పక్కింటి అమ్మాయికి జరిగినట్లు జరుగుతుందని భయపడుతున్నావా అనడంతో మరి ఏం చేయాలో అర్థం కావడం లేదు అక్క అని అంటుంది. నేను కాదు నువ్వు కూడా దానిమీద ఒక కన్నేసి ఉంచక్క అని అనడంతో సరే అని అంటుంది. మరొకవైపు డబ్బులు ఎలా అడ్జస్ట్ చేయాలి అనుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది స్వప్న. అప్పుడు రాహుల్ ఏమి తెలియనట్టుగా వచ్చి ఏమీ స్వప్న ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏం లేదు అని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది స్వప్న.
Brahmamudi November Today 21 Episode: రాహుల్ పై అనుమాన పడుతున్న స్వప్న
అప్పుడు రాహుల్ ప్రవర్తన పై స్వప్న అనుమాన పడుతూ ఉండగా దీనికి అనుమానం వచ్చినట్టు ఉంది సైలెంట్ గా తప్పించుకోవాలి అని అనుకుంటాడు రాహుల్. సరే నేను నీ మంచి కోసమే హెల్ప్ చేయాలని అడిగాను చెప్పకపోతే నీ ఇష్టం అని చెప్పి రాహుల్ ఒకచోట కూర్చొని మొబైల్ చూస్తూ ఉండగా నిజంగానే నాకు రాహుల్ హెల్ప్ చేస్తాడా అడిగితే ఏమనుకుంటాడో అని అనుకుంటూ ఉంటుంది స్వప్న. తరువాత రాజ్ డోర్ వేయడానికి ఇబ్బంది పడుతుండగా కావ్యం వచ్చి ఏం చేస్తున్నారు అని అనడంతో రేపు ప్రొద్దున కళ్ల డాక్టర్ దగ్గరికి వెళ్దామా నీకు కళ్ళు సరిగా కనిపించడం లేదు కదా అంటూ ఇద్దరు ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు. తర్వాత అప్పు ఇంకా నిద్ర లేవక పోయేసరికి కనకం అప్పు గదికి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.