Brahmamudi October 18 Today Episode: ఈ రోజు ఎపిసోడ్ లో రాజ్ దొంగచాటుగా వెళ్తూ ఉండగా అప్పుడు వెనకాల కావ్య వచ్చి పిలవడంతో రాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. అప్పుడు కావ్యని డ్రెస్ లో చూసి రాజ్ ఆశ్చర్యపోతాడు. ఏంటి డ్రెస్ మార్చుకున్నావ్ అనగా బైక్ లో వెళ్తున్నాం అన్నారు కదా అందుకే డ్రెస్ వేసుకున్న అంటుంది కావ్య. తరవాత రాజ్ కావ్య లు ఎవరి కంట పడకుండా దొంగ చాటుగా బయటికి వెళ్ళిపోతారు. తరువాత రాజ్ కావ్య ఇద్దరు బైక్ లో వెళ్తూ ఉండగా అప్పుడు కావ్య కావాలనే రాజ్ ని హత్తుకొని కూర్చుంటుంది.
రాజ్ ని హత్తుకున్న కావ్య
అప్పుడు రాజ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ కావ్య మాత్రం తన భర్తని అలాగే హత్తుకుని భర్తలు భార్యని ఇలా బయటకు పిలుచుకుని వెళితే చాలా ఆనందంగా ఉంటుంది అని చెబుతూ ఉంటుంది. అలా వారిద్దరి మధ్య రొమాంటిక్ మూమెంట్ ఏర్పడుతుంది. తరవాత రాజ్,కావ్య ఇద్దరు కలిసి వైన్ షాప్ ముందు ఆపగా అప్పుడు ఒక అతను కోటర్ కావాలా అని అడగగా రాజ్ అవసరం లేదు అని అంటాడు. కావ్య రాజ్ ని ఆట పట్టించడానికి సెటైర్స్ వేస్తూ ఉంటుంది. తర్వాత ఇద్దరూ కలిసి పాన్ షాప్ దగ్గరికి వెళ్తారు. అక్కడ పాన్ షాప్ క్లోజ్ చేసి ఉంటుంది.కానీ లాక్ వేయకపోవడంతో ఇద్దరూ ఎలా లోపలికి వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఇద్దరూ ఎవరు లేనిది చూసి దొంగచాటుగా లోపలికి వెళ్తారు. ఇక లోపల పాన్ లు తీసుకుని ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఫుల్ గా డాన్సులు వేస్తూ ఉంటారు.
దొంగతనంగా షాపులోకి దొరికిన రాజ్, కావ్య
మధ్య మధ్యలో కామెడీ పంచులు వేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు రాజ్ లోపల తమలపాకులను ఒకటి రెండు అని పిలుస్తూ ఉండగా ఇంతలో షాపు ఓనర్ అక్కడికి వస్తాడు. కానీ అతడు లోపల డబ్బులు దొంగలిస్తున్నాడు అనుకోని వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆ పాన్ షాప్ ఓనర్ తో కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు. లోపల రాజ్ కావ్య పండ్లు తినిపించుకుంటూ పాటలు పెట్టి ఫుల్ గా డాన్స్ చేస్తూ ఉండగా బయట షాప్ ఓనర్ టెన్షన్ తో భయపడుతూ ఉంటాడు. రాజ్ కి ఫుల్ గా కిక్ ఎక్కడంతో ఫుల్ గా డాన్స్ లు చేస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు.
Brahmamudi October 18 Today Episode: పోలీసులకు దొరికిపోయిన రాజ్ దంపతులు
అప్పుడు రాజ్ కావ్య పోలీసులను చూసి షాక్ అవుతారు. అప్పుడు రాజ్ కి నాలుక మందం అవడంతో మాట్లాడేకి రాక నత్తి నత్తిగా మాట్లాడుతాడు. పోలీసులకు ఆ భాష అర్థం కాకపోవడంతో కావ్య ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కీల్లీ షాప్ మొత్తం దొంగతనం చేశారు ఒకటి రెండు అంటూ డబ్బులు లెక్క పెట్టారు నా డబ్బులు ఇవ్వమని చెప్పండి సార్ అని పోలీసులను ప్రార్థిస్తూ ఉంటాడు. పోలీసులకు రాజ్ మాటలు అర్థం కాక తల గోక్కుంటూ ఉంటారు. అప్పుడు ఆ షాప్ ఓనర్ రాజ్ కి వాటర్ ఇవ్వడంతో అప్పుడు రాజ్ ఎప్పటిలాగే మాట్లాడుతాడు.. ఎవరు మీరు అని పోలీసులు అడగగా కావ్య , రాజ్ గతం గురించి చెప్పే ప్రయత్నం చేయగా ప్లీజ్ చెప్పకు ఇంట్లో తెలిస్తే నా పరువు పోతుంది అని అంటాడు రాజ్.