Brahmamudi October 20 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ప్రారంభంలో బయటికి వచ్చిన అప్పు కార్ డోర్ తీస్తుంది. అక్కడ అనామికని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగగా చిన్న షాపింగ్ చేద్దామని వచ్చాము. నువ్వొస్తే మా షాపింగ్ ఫాస్ట్ గా అయిపోతుంది అంటుంది అనామిక. అప్పుడు అప్పు కోపంగా కళ్యాణ్ వైపు చూస్తుంది. అప్పుడు కళ్యాణ్ భయపడుతూ అంటే నువ్వు నిజం చెప్తే రావని ఇలా చేశాను బ్రో అని అంటాడు. ఏమీ లేక అప్పు కోపంగా వెళ్లి వెనక సీట్ లో కూర్చుంటుంది. మరొకవైపు ఇంట్లో పనులు అన్ని చకచగా చేసుకుంటూ అందరికీ కాఫీ ఇస్తుంది కావ్య. అప్పుడు కాఫీ ఇవ్వడం కాస్త ఆలస్యం అవ్వడంతో అపర్ణకు కావ్య సారీ చెప్పడంతో సారీ చెప్పడం ఎందుకు అని అంటుంది.
కావ్యకు సపోర్ట్ చేస్తున్న సుభాష్
తప్పు చేసింది నీ కొడుకు వెళ్లి వాడిని అడుగు అంటాడు సుభాష్. కోడల్ని ఒక మాట అననివ్వడు అంటుంది రుద్రాణి. ఆ తర్వాత చక చకా ఇంటి పని చేస్తున్న కావ్య ని చూసి ఆనందపడతారు సీతారామయ్య దంపతులు. అప్పుడు కావ్య గురించి మనసులో చాలా గొప్పగా అనుకుంటూ ఉండగా అది చూసి రాజ్ కూడా కాస్త లో లోపల సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు కనకం వాళ్ళ మాటలు విని వెళ్లి తన కూతురికి సహాయం చేయాలి అనుకుంటుండగా అపర్ణ అడ్డుకుంటుంది. కావ్య కూడా వద్దులేమ్మా కొంచెం పనే కదా నేను చేసుకుంటాను వెళ్లి అక్కకి ఏం కావాలో చూడు అని చెప్పి పంపించేస్తుంది. మరోవైపు లాయర్ తో మాట్లాడుతాడు రాహుల్. ఈరోజు డబ్బులు ఎలాగైనా ఇస్తాను మీరు బెయిల్ అరేంజ్ చేయండి అని చెప్తాడు.
స్వప్నని మోసం చేస్తున్న రాహుల్
ఫోన్ పెట్టేసిన తర్వాత స్వప్న దగ్గరికి వెళ్లి 10 లక్షలు కావాలి అని అడుగుతాడు. అప్పుడు షాక్ అవుతుంది స్వప్న. అంత డబ్బులు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అనడంతో నువ్వు నీ నగలు ఇస్తే అవి తాకట్టు పెట్టి మళ్ళీ నీకు తెచ్చి ఇస్తాను అనగా వామ్మో అవి తాత ఇచ్చి నగలు నేను ఇవ్వను మళ్ళీ తాతయ్య నన్ను తిడతాడు అని అంటుంది స్వప్న. సారీ రాహుల్, నీ మీద నాకు నమ్మకం లేదు, నగలు ఇవ్వలేను అని చెప్పి తన నగల్ని లోపల దాచేసి కిందికి వెళ్ళిపోతుంది స్వప్న. దీని పర్మిషన్ ఏంటి, ఇప్పటికే దాన్ని అడిగి టైం వేస్ట్ చేశాను అనుకొని కబోర్డ్ లో ఉన్న నగలు తీసి బ్యాగ్ లో పెట్టుకుని కిందికి వెళ్తాడు. ఇంట్లో వాళ్లు అందరూ హల్లో ఉండడం చూసి కంగారు పడతాడు కానీ కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు.
రాహుల్ పై సీరియస్ అయిన రాజ్
అప్పుడు రాజ్ ఏం తీసుకెళ్తున్నావు అని అడగగా రాహుల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ప్రకాష్ ఏవో కొత్త నగల డిజైన్స్ ఉన్నట్టున్నాయి. నాకు చూపించు అని బ్యాగ్ తీసుకునే ప్రయత్నం చేయగా ఆ నగలు కింద పడడంతో అందరూ షాక్ అవుతారు. అన్ని నగలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు రాజ్. ఇంకెక్కడికి తాకట్టు పెట్టడానికి అయి ఉంటుంది కావ్య. ఏంటి రాహుల్ ఇలా చేసావు, ఇప్పుడిప్పుడే బాధ్యతగా నడుచుకుంటున్నావు అనుకుంటున్నాము, నీకు ఒక బ్రాంచ్ అప్పచెప్పాలని నేను డాడీ మొన్నే అనుకున్నాము. మళ్ళీ నువ్వు పాత రాహుల్ లాగే ఉన్నావు అని రాహుల్ మీద విరుచుకుపడతాడు రాజ్. అప్పుడు అందరు తలా ఒక మాట అనడంతో స్వప్న వచ్చి ఆపండి ఎందుకు నా భర్తను అందరు నిలదీస్తున్నారు.
Brahmamudi October 20 Today Episode: భర్తను వెనకేసుకొచ్చిన స్వప్న..
నేనే నా నగలకు షైనింగ్ పెట్టించుకుని రమ్మని చెప్పి నా భర్తకు నగలు ఇచ్చాను అంటూ రాహుల్ ని సేవ్ చేస్తుంది స్వప్న. అప్పుడు రాహుల్ కూడా నాలుగు దొంగ కన్నీరు కారుస్తాడు. సందు దొరికింది కదా అని ఇంట్లో వాళ్ళందరిపై రెచ్చిపోయి మాట్లాడుతుంది రుద్రాణి.నీ జీవితాన్ని జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో అనే బాధతో అలా అన్నాను అని సారీ చెప్తాడు రాజ్. మెరుగు పెట్టించే వాడిని రేపు ఇంటికి రమ్మని చెప్తాను తీసుకువెళ్లి ఆ నగలు లోపల పెట్టు అని స్వప్నకి చెప్తుంది చిట్టి. మరోవైపు కారులో కూర్చున్న అనామిక చూసావా నువ్వు రాబట్టే షాపింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది అని అప్పుతో అంటుంది.