Brahmamudi October 26 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో రాజ్ కావ్య తో మాట్లాడుతూ మూడు నెలలు గడువు అడిగాను కదా ఓన్లీ త్రీ మంత్స్ అనడంతో మీరు లెక్కలు మరిచిపోయారు ఒక నెల ఆల్రెడీ అయిపోయింది కేవలం రెండు నెలలు మాత్రమే ఉంది అని అంటుంది కావ్య. సరే అని చెప్పి రాజ్ వెళ్లి పడుకుంటాడు. అప్పుడు కావ్య రొమాంటిక్ సాంగ్ పెడుతుంది. అప్పుడు రాజ్ ఎలా అయినా పాట ఆఫ్ చేయాలి అనుకుంటూ వెళ్లి కావ్య మీద పడతాడు. అప్పుడు పాట ఆపు అని అనగా నాకు పాటలు అంటే చాలా ఇష్టం అంటుంది కావ్య. సర్లే ఫస్ట్ పాటలు ఆపు అని కావ్యని అరుస్తాడు రాజ్. తర్వాత ఇద్దరు పడుకొని నిద్ర పోతారు.
కళ్యాణ్ అనామిక ఫోటోలు డిలీట్ చేసిన అప్పు
మరొకవైపు అప్పు కళ్యాణ్, అనామికలు చేసిన అల్లరి వాళ్లు గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. తర్వాత కళ్యాణ్ ఫోన్ చేయడంతో విసుక్కుంటూ సెటైర్లు వేస్తూ మాట్లాడుతుంది అప్పు. అప్పుడు అప్పు తన మనసులో మాట ఇండైరెక్టుగా చెప్పినా కూడా కళ్యాణ్ కి అర్థం కాకపోవడంతో విసుక్కుంటూ ఫోన్ కట్ చేస్తుంది అప్పు. అప్పుడు కళ్యాణ్ చెప్పిన విధంగా వాళ్ళ ఫోటోలు సెండ్ చేయకుండా వాళ్ళ ఫోటోలు డిలీట్ చేయడంతో ఏంటమ్మా వాళ్ళ ఫోటోలు డిలీట్ చేస్తున్నావు ఇలా ఇవ్వు అని వారి ఫోటోలు చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇప్పుడు అప్పు ప్రవర్తన కాస్త తేడాగా మాట్లాడడంతో ఏంటమ్మా అలా ఉన్నావు అంటాడు కృష్ణమూర్తి. డిలీట్ చేయకు అనడంతో వాళ్ల దగ్గర కూడా ఈ ఫొటోస్ ఉన్నాయి అని అబద్ధం చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది అప్పు.
స్వప్నకు సీమంతం చేయాలనుకుంటున్న రాజ్ ఫ్యామిలీ
అప్పుడు అప్పు వాళ్ళ పెద్దమ్మ అక్కడికి వచ్చి నీ మనసులో ఉన్న ప్రేమను దూరం చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ వాళ్ళ ఫ్యామిలీ పంతులు గారిని పిలిచి స్వప్న సీమంతానికి ముహూర్తం చూస్తూ ఉండడంతో ఇంతలో అక్కడికి వచ్చిన కావ్య అది చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు పంతులు ముహూర్తం ఫిక్స్ చేయడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు ఏంటి రుద్రాన్ని నువ్వు ఏమీ మాట్లాడడం లేదు అని అంటుండగా అప్పుడు రుద్రాన్ని లోలోపల ఎలా అయినా స్వప్న తన పుట్టింటికి వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది. అయినా మీరు నాకు ఇప్పుడు కాదు వదిన చెప్పాల్సింది పంతులు గారిని పిలవకముందు నాకు ఒకసారి ఇంఫార్మ్ చేయాలి అని అంటుంది. అప్పుడు రుద్రాణి కారంగా మాట్లాడడంతో సుభాష్ తగిన విధంగా బుద్ధి చెపుతాడు.
నిజం చెప్పాలనుకుంటున్న కావ్య
అప్పుడు చిట్టి సీమంతం గురించి ఎంతో ఆనందంగా మాట్లాడడంతో కావ్య నిజం చెప్పే ముందు స్వప్నకు సైగలు చేస్తుంది. అప్పుడు కనకం కూడా చాలా సంతోషంగా మాట్లాడుతుంది. అప్పుడు చిట్టి అమ్మ కావ్య మీ అక్క సీమంతం ఎలా జరిపిస్తావో నీ ఇష్టం, మొత్తం బాధ్యత నీకే ఇస్తున్నాము అని అంటుంది. అప్పుడు కావ్య ఇంతమంది నా మీద నమ్మకంగా ఉన్నప్పుడు ఇంత పెద్ద అబద్దాన్ని చెప్పకుండా దాచి మోసం చేయలేను ఇప్పుడే చెప్పేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఎంతమంది అడిగినా కూడా కావ్య నిజం చెప్పకుండా నీళ్లు నములుతూ ఉండడంతో అప్పుడు కావ్య ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని స్వప్న భయపడుతూ ఉంటుంది. అప్పుడు కావ్య నిజం చెప్పడానికి ప్రయత్నించగా అప్పుడు సెలెక్ట్ చేయాలి కదా అని కావ్యని బలవంతంగా లోపలికి పిలుచుకొని వెళ్తుంది స్వప్న.
కావ్య నోరు మూయించిన స్వప్న
తర్వాత స్వప్న కావ్య గదిలోకి తీసుకొని వెళ్లి ఏం చేస్తున్నావ్ అర్థం అవుతుందా అనగా అర్థం అవుతుంది అంత మందిని మోసం చేయాలని ఎలా అనిపిస్తుంది అని అంటుంది. అంతముందు నీకు సీమంతం చేయాలని ఆశపడుతున్నారు ఎంతమందిని మోసం చేస్తావు అని అంటుంది. ఎన్నైనా చెప్పు నేను నిజం చెప్పేస్తాను అని అంటుంది కావ్య. నిజం చెప్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు అర్థం అవుతుందా మా అత్తయ్య నేను ఎప్పుడు తప్పు చేస్తానా అని ఎదురుచూస్తోంది ఈ విషయం బయట పడగానే నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది అని అంటుంది స్వప్న. అప్పుడు కావ్య ఎంత చెప్పడానికి ప్రయత్నించినా కూడా స్వప్న పిచ్చిగా మాట్లాడుతుంది.
Brahmamudi October 26 Today Episode: మరో తప్పు చేయడానికి సిద్ధపడిన స్వప్న
సీమంతం అయిపోగానే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ ఏదో ఒక పని చేసి నాకు కడుపుకు పోయిందని అప్పుడు అందరికీ చెప్పేస్తాను అని అంటుంది. ఆ మాటలకు కావ్య షాక్ అవుతుంది. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి మళ్లీ ఇంకొక అబద్ధం ఆడుతున్నావా పూర్తిగా నష్టపోతావు ఇరుక్కుంటావో అని కావ్య ఎంత హెచ్చరించినా కూడా స్వప్న అలాగే ముందుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు కావ్యని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి నిజం చెప్పకుండా ఆపేస్తుంది స్వప్న. నిజం చెప్తే నేను చచ్చిపోతాను అంటూ బెదిరిస్తుంది స్వప్న. అప్పుడు కావ్య ఆలోచించుకుంటూ కిందికి వెళుతుంది. ఇంట్లో అందరూ సీమంతం గురించి సంతోషంగా మాట్లాడుకుంటూ అది చూసిన కావ్య భయంతో ఎలా అయినా నిజం చెప్పేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది.