Brahmanandam: టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కమెడియన్ గా గుర్తింపు పొందిన బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న బ్రహ్మానందం హాస్యబ్రహ్మగా గుర్తింపు పొందాడు. ఇప్పటికీ వయసు పైబడిన కూడా అడపా దడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఇప్పటివరకు తన కామెడీతో అందరినీ నవ్వించిన బ్రహ్మానందం ఇటీవల విడుదలైన రంగమార్తాండ సినిమాలో మాత్రం తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం తన జీవితంలో జరిగిన ఒడిదుడుకుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ..” నా జీవితంలో రెండు పూటలా అన్నం తినటానికి కూడా ఆలోచించిన రోజులు ఉన్నాయి. అలాంటి రోజుల నుండి ఇలాంటి పరిస్థితికి వస్తానని ఎన్నడూ ఊహించలేదు. ఎంఎ చదివి లెక్చరర్ గా పనిచేసిన తాను ఇలా ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను. సినిమాలలోకి రాకముందు డబ్బుల కోసం ఎన్నో ఇబ్బందులు పడిన నేను ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నాను. అయితే ఎవరైనా కూడా ఎదుటివారు బాగుపడాలని కోరుకుంటారు కానీ తమ కన్నా బాగుపడాలని ఎవరూ కోరుకోరు.
Brahmanandam అన్ని దాటుకొని ఈ స్థాయికి వచ్చాను…
నా జీవితంలో కూడా అలాగే జరిగింది. స్టార్ హీరోలతో సమానంగా ఎదుగుతున్న నన్ను చూసి చాలామంది అసూయపడ్డారు. ఇండస్ట్రీలోకి కొత్త కమెడియన్లు రాగానే బ్రహ్మానందం పనైపోయింది అనేవారు. కానీ నేను అవన్నీ దాటుకొని వచ్చాను. ఇక రంగమార్తండ సినిమాలో ఈ పాత్రకు మీరు తప్పా ఎవరు న్యాయం చేయగలరు మాస్టారు అని కృష్ణ వంశీ అనగానే ఇది చాలు నా జీవితానికి అని అనుకున్నా ” అంటూ బ్రహ్మానందం ఎమోషనల్ అయ్యాడు.