Brahmastra: బాలీవుడ్ వాళ్లకంతలేదా..బ్రహ్మాస్త్రకు రాజమౌళి సీక్రెట్‌గా వర్క్ చేశారా..? అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వచ్చి వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ దర్శక దిగ్గజం అయాన్ ముఖర్జీ ఎమో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, రణ్‌వీర్ కపూర్, ఆలియా భట్, అక్కినేని నాగార్జున ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమా రూపొందుతుండగా, మొదటి భాగం త్వరలో రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేశారు. అయితే, ఈ ట్రైలర్ చూసిన తర్వాత రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో మన సౌత్‌లో ముఖ్యంగా తెలుగులో రాజమౌళి సహా మిగతా ఏ దర్శకులు సినిమా తీసిన విజువల్ వండర్‌గా ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో హిందీలో మంచి హిట్ సినిమా అంటే కశ్మీర్ ఫైల్స్ ఒక్కటే అని చెప్పాలి. హిందీ సినిమాలు వరుసగా ఫ్లాపవుతున్న సమయంలో మన సౌత్ సినిమాలు హిందీలో కూడా రిలీజై భారీ హిట్ సాధిస్తున్నాయి.
Brahmastra: రాజమౌళి వీఎఫెక్స్ టీమ్ తో కలిసి సీక్రెట్‌గా వర్క్..?
అయితే, తాజాగా వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా ట్రైలర్ చూస్తే, వీఎఫెక్స్ చాలా వీక్‌గా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికంటే హిందీలో రూపొందించే నాగిని వంటి సీరియల్స్ వీఎఫెక్స్ వర్క్‌లో అద్భుతం అని ఇంత భారీ తారాగణం ఉన్న సినిమాకు ఇలాంటి వీక్ విజివల్స్ ఏంటీ అని మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈ మాత్రం అయినా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే అది టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి వల్లే అని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, బ్రహ్మాస్త్ర సినిమా కోసం రాజమౌళి వీఎఫెక్స్ టీమ్ తో కలిసి సీక్రెట్‌గా వర్క్ చేశారని చెప్పుకుంటున్నారు. అలా చూసుకున్న రాజమౌళి రేంజ్‌లో అయితే వీఎఫెక్స్ లెవనేది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే.