Break Up సినీ ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు, బ్రేకప్ స్టోరీలు సర్వసాధారణమైన విషయమే. ఎవరు ఎప్పుడు ఎవరితో లవ్ లో పడుతారు..? ఎప్పుడు బ్రేకప్ చెప్పేస్తారో చెప్పడం కష్టమే. బాలీవుడ్ లోనైతే ఇది చాలా చాలా కష్టమైన పని. ఇంతకీ ఈ టాపిక్ ఇపుడెందుకు వచ్చిందనుకుంటున్నారా..? స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్, బాలీవుడ్ భామ అనన్యపాండే చాలా కాలంగా రిలేషన్షిప్ ఉన్నారంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై అనన్యకానీ, ఇషాన్ ఎప్పుడూ బాహాటంగా స్పందించలేదు.
అయితే తాజాగా వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ కు బ్రేకప్ చెప్పుకున్నారంటూ బీటౌన్ లో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఖాలీ పీలి సినిమా సెట్స్ లో లవ్ లో పడ్డ ఇషాన్-అనన్య..దురదృష్టవశాత్తు బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఓ వార్త ఇపుడు హల్ చల్ చేస్తోంది. ఈ ఇద్దరూ చాలా పాజిటివ్ గా తమ బంధానికి స్వస్తి పలికినట్టు వార్తలువస్తున్నాయి. ఇటీవలే షాహిద్ కపూర్ బర్త్ డే పార్టీలో కలిసి సందడి చేశారు ఇషాన్-అనన్య. షాహిద్ కపూర్ ఫ్యామిలీ అనన్యపాండేకు గ్రాండ్‌గా వెల్ కమ్ చెప్పారంటూ నెట్టింట్ల విడుదలైన ఫొటోలు చెప్పాయి. కాగా కట్ చేస్తే నేడు ఇలా సడెన్‌గా ఇద్దరూ బ్రేకప్ చెప్పుకోవడంపై మూవీ లవర్స్ కొందరు నిరాశకు లోనవుతుండగా…మరికొందరేమో సర్ ప్రైజ్ అవుతున్నారట.
Break Up Ishaan Khattar & Ananya Panday తాజా బ్రేకప్ వార్తలపైనైనా ఈ ఇద్దరు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే కూతురుగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి మెరిసింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో విజయ్ దేవరకొండతో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న లైగర్ లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంతో అనన్యపాండే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు ధడక్‌తో మంచి ఫాంలోకి వచ్చిన ఇషాన్ ఖట్టర్ ప్రస్తుతం ఫోన్ భూత్, పిప్పా చిత్రాల్లో నటిస్తున్నాడు.