Theaters: సినిమా థియేటర్‌కు బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ ను అనుమతించరు. థియేటర్‌లోని స్టాళ్లల్లో ఫుడ్ తినాలంటే టికెట్ రేట్ కంటే ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో థియేటర్ లో దొరికే ఫుడ్ ను తింటారు. మరికొంతమంది ఎక్కువ ఖర్చు పెట్టి తినడం ఇష్టం లేక కొనుగోలు చేయరు. బయట రేట్ల కంటే థియేటర్ లో పదార్ధాలను ఎక్కువ రేటుకు విక్రయిస్తూ ఉంటారు.
అయితే సినిమా థియేటర్ల లోపలికి ఫుడ్ ను తీసుకెళ్లడంపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసిహతో కూడిన ధర్మానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా థియేటర్లు యాజమానుల ప్రైవేట్ ఆస్తులు కాబట్టి లోపలికి ఫుడ్ ను అనుమతించకుండా నియంత్రించే హక్కు వారికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
థియేటర్లలోకి బయట ఫుడ్ ను అనుమతించాలని జమ్మూకశ్మీర్ హైకోర్టు 2018 జులై 18న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ థియేటర్లు, మల్టీఫ్లెక్సీల యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు ప్రైవేట్ ఆస్తులు కాబట్టి యాజమానులు బయట పుడ్ ను అనుమతించకుండా నిబంధనలు పెట్టుకునే హక్కు వారికి ఉందని తెలిపింది.
Theaters:
బయట ఫుడ్ ను అనుమతించాలా.. వద్దా అనేది వారి ఇష్టప్రకారం ఉంటుందని, తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే పిల్లలకు ఉచిత ఆహారం, మంచినీరు అందించాలని సినిమా హాళ్లను ఆదేశించామంది. ప్రజాప్రయోజనాలు, భద్రతకు విరుద్దం కానంత వరకు థియేటర్, మల్లీఫ్లెక్స్ యజమానులు నిబంధనలు పెట్టుకోవడానికి అర్హత ఉందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఆసక్తికరంగా మారింది. సుప్రీం తీర్పుతో థియేటర్ల యజమానులకు ఊరట కలిగింది.