Chaitanya Master: కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఒక్కసారిగా అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చైతన్య మాస్టర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మరి ఈయన సూసైడ్ చేసుకున్నారు. ఇలా చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకోవడంతో పలువురు ఈయన మృతి పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే కండక్టర్ ఝాన్సీ సైతం చైతన్య మాస్టర్ తో కలిసి ఒక కార్యక్రమంలో చేశారు. ఈ క్రమంలోనే చైతన్య మరణ వార్త తెలియగానే ఝాన్సీ ఎంతో ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది అయితే ఈయన మరణానికి గల కారణాలను కూడా ఝాన్సీ తెలియజేశారు.చైతన్య డిసెంబర్ 31వ తేదీ ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు అయితే ఆ ఈవెంట్ కోసం వస్తామన్నటువంటి ఆర్టిస్టులు తనకు హ్యాండ్ ఇచ్చారు. ఈ విధంగా వస్తామని చెప్పి ఆ ఈవెంట్ కి రాకపోవడంతో ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ వారు తనకు ఇవ్వాల్సిన ఆరు లక్షలు ఇవ్వలేదు.
Chaitanya Master: పేమెంట్ ఇవ్వకపోవడంతోనే…
ఇలా తనకు పేమెంట్ ఇవ్వకపోవడంతో ఆర్టిస్టులకు ఇవ్వడానికి ఈయన డబ్బును అప్పు చేశారు. ఇలా ఆ డబ్బు కట్టడం కోసమే పెద్ద ఎత్తున అప్పులు చేశారని అయితే ఆ అప్పులు ఇచ్చినటువంటి వారు ఒత్తిడి తీసుకురావడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఇలా నిర్ణయం తీసుకొని ఉంటారని ఈ సందర్భంగా కండక్టర్ ఝాన్సీ చైతన్య మరణం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.